ఐపీఎల్-16వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తన హోం గ్రౌండ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై విజయం అనంతరం ప్లేఆఫ్ ఆశలతో గుజరాత్ టైటాన్స్‌పై పోరుకు సిద్ధమైంది.
ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచి అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. కాలి కండరాల గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది.
వరుసగా రెండు ఓటములు చవిచూసిన రాజస్థాన్ రాయల్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా జైపూర్ వేదికగా అద్భుత ఫామ్ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తో నేడు తలపడనుంది.
ఐపీఎల్ లో తొలి దశ మ్యాచ్ లు నిన్నటితో ( ఏప్రిల్ 25 ) పూర్తయ్యాయి. లీగ్ లో పాల్గొంటున్న మొత్తం 10 జట్లు ఇప్పటి వరకు ఏడేసి మ్యాచ్ లు ఆడాయి. 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ( 0.662 ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్ సైతం 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించినప్పటికీ.. చెన్నైతో పోలిస్తే కాస్త రన్ రేట్ ( 0.580…