ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో వరుసగా రెండు ఓటములు చవిచూసిన రాజస్థాన్ రాయల్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా జైపూర్ వేదికగా అద్భుత ఫామ్ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తో నేడు తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి తిరిగి గెలిపు బాట పట్టాలని శాంసన్ సేన భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒక్క మార్పుతో బరిలోకి దిగాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also : Ram Navami violence: రామనవమి హింసపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. ఎన్ఐఏ దర్యాప్తుకు ఆదేశం…
ఇప్పటి వరకు టోర్నీలో పెద్దగా రాణించలేకపోతున్న ఆల్ రౌండర్ జాసన్ హౌల్డర్ స్థానంలో స్పిన్నర్ ఆడమ్ జంపాకు అవకాశం ఇవ్వాలని రాజస్థాన్ మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. అయితే జైపూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి కచ్చితంగా జంపాను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
Read Also : CM KCR: క్యాడర్ లో అసంతృప్తిని తగ్గించండి.. అవసరమైతే టీవీ ఛానల్ ను నడపండి
ఇక వరుసగా విఫలమవుతున్న ఆల్ రౌండర్ రాయన్ పరాగ్ ను కూడా మరోసారి బెంచ్ కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. పరాగ్ ఈ సీజన్ లో దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకోవడంలో రియాన్ విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి పక్కన బెట్టింది. అదే విధంగా యువ ఆటగాడు దృవ్ జురల్ ను రాజస్థాన్ కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో జురల్ ( 42 ) ఆకట్టుకున్నాడు.
