KKR vs GT: ఐపీఎల్-16వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తన హోం గ్రౌండ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై విజయం అనంతరం ప్లేఆఫ్ ఆశలతో గుజరాత్ టైటాన్స్‌పై పోరుకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా.. కోల్‌కతా జట్టుపై గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‌కు వెళ్లాలని గుజరాత్ ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా జట్టు 3 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కోల్‌కతా జట్టు తన చివరి మ్యాచ్‌లో బెంగళూరుపై అద్భుత విజయం సాధించింది. అయితే కోల్‌కతా జట్టులోకి పేసర్ వైభవ్ అరోరా స్థానంలో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read Also: Royal Enfield Hunter: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 450.. బైక్ లాంచ్ ఎప్పుడంటే..
కోల్‌కతా జట్టు అంచనా: N జగదీశన్ (wk), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రానా (c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్,వరుణ్ చకరవర్తి. ఇంపాక్ట్ సబ్ – సుయాష్ శర్మ.
గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనా: వృద్ధిమాన్ సాహా (వికెట్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (సి), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ