మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ కొన్ని రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే! అది నిజమేనన్నట్టు ధోనీ సైతం ఒక స్పీచ్‌లో సంకేతాలూ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతూ ప్లేఆఫ్స్ రేసులో తొలి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ నేడు ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢీకొనబోతున్నది. ఆడిన 8 మ్యాచ్‌లలో ఆరు గెలిచిన గుజరాత్‌ను అడ్డుకోవడం ఢిల్లీ టీమ్ కి ప్రస్తుతానికైతే శక్తికి మించిన పనే అని తెలుస్తోంది.
ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది.
ఐపీఎల్ 16వ సీజన్ ఇప్పటివరకు సగానికి పైగా లీగ్ మ్యాచ్‌లు అయిపోయాయి. ఈ సీజన్‌లో కూడా భారత ఆటగాళ్లతో పాటు పలువురు ఫారిన్ ప్లేయర్స్ కూడా తమ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. వీరు తాము ఆడుతున్న జట్లను ఒంటిచేత్తో గెలిపించాలని చూస్తున్నారు. ఇందులో డెవాన్ కాన్వే, జోస్ బట్లర్, రషీద్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ 1000 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ నిర్ధేశించిన లక్ష్యాన్ని రోహిత్ శర్మ సేన 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తమ జట్టు అద్భుతంగా ఆడుతోందని సంజూ శాంసన్ అన్నాడు. టీమ్ మంచి ఫాంలో ఉందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ వెల్లడించాడు.
అండర్-16 ఆటగాళ్లతో దినేశ్ కార్తీక్ మాట్లాడాడు. అతను వారికి అవసరమైన సలహాలను, సూచనలను వివరించాడు. ఈ ప్రత్యేకమైన మీటింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ వైరల్ అవుతున్న ఫోటోలు డీకేను ట్రోల్ చేస్తున్నారు.