బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అండర్-16 ఆటగాళ్ల ప్రత్యేక శిబిరంలో రాయల్ ఛాలెంజర్స్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కనిపించాడు. ఈ అండర్-16 ఆటగాళ్లతో దినేశ్ కార్తీక్ మాట్లాడాడు. అతను వారికి అవసరమైన సలహాలను, సూచనలను వివరించాడు. ఈ ప్రత్యేకమైన మీటింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ వైరల్ అవుతున్న ఫోటోలు డీకేను ట్రోల్ చేస్తున్నారు.
Also Read : KKR vs GT: కేకేఆర్‌పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం
ఎందుకంటే ఈ ఐపీఎల్ లో దినేశ్ కార్తీక్ పేలవ ప్రదర్శనతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడిన కార్తీక్ కేవలం 83 పరుగులే చేశాడు. అంటే ఆ జట్టుకి ఫినిషర్ గా ఉన్న దినేశ్ తన బ్యాటింగ్ లో 11.86 పరుగులు మాత్రమే చేశాడు. దినేశ్ కార్తీక్ లాంటి ఆటగాడు మిడిలార్డర్ లో విఫలమవ్వడమే ఆర్సీబీ జట్టు ఓటమికి ప్రధాన కారణమని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Chennai: చెన్నై ఎయిర్‌పోర్టులో పాముల కలకలం..
దినేశ్ కార్తీక్ ఇంత పేలవ ఫామ్ లో ఉన్న యువ క్రికెటర్లకు ఏ విధమైన సలహాలు ఇచ్చేందుకు వెళ్లాడని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. యంగ్ ప్లేయర్స్ కు ఇచ్చిన సలహాలను మీ కెరీర్ లో ఉపయోగించుకోండి అని కొందరు అంటుంటే.. మరి కొందరు పేలవమైన ఫామ్ లో ఉన్నా.. అవకాశం ఎలా పొందాలో సలహా ఇచ్చి ఉంటాడు.. అంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : CM KCR : రేపే కొత్త సచివాలయ ప్రారంభోత్సవం.. రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు
ఇంకొ నెటిజన్ అయితే పరిమితి ఓవర్ల క్రికెట్ లో 391 మ్యాచ్ లు ఆడి ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన ఆటగాడు యువ క్రికెటర్లకు ఏ విధమైన పాఠాలు నేర్పుతాడు అని కామెంట్స్ చేస్తున్నారు. అండర్-16 ఆటగాళ్లలో ఇంటరాక్ట్ అయిన దినేశ్ కార్తీక్ ఇప్పుడు మాత్రం ట్రోల్స్ కు పోజులిచ్చాడు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో అతను తన గత ఫామ్ ను ప్రదర్శించి ట్రోలర్స్ కు బ్యాట్ తో సమాధానం చెబుతాడని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.