ఐపీఎల్ 16వ సీజన్ ఇప్పటివరకు సగానికి పైగా లీగ్ మ్యాచ్‌లు అయిపోయాయి. ఈ సీజన్‌లో కూడా భారత ఆటగాళ్లతో పాటు పలువురు ఫారిన్ ప్లేయర్స్ కూడా తమ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. వీరు తాము ఆడుతున్న జట్లను ఒంటిచేత్తో గెలిపించాలని చూస్తున్నారు. ఇందులో డెవాన్ కాన్వే, జోస్ బట్లర్, రషీద్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Also Read : Smoking : ఏంటయ్యా ఇది.. అది చేయకూడదని ఇలా చేయడం అవసరమా?
1. జోస్ బట్లర్ : గత ఐపీఎల్ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన జోస్ బట్లర్ ఈ సీజన్‌లోనూ బ్యాట్‌తో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. బట్లర్ ఇప్పటి వరకు ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో 33.88 సగటుతో 3 హాఫ్
సెంచరీలు నమోదు చేశాడు. మొత్తం 271 పరుగులు చేశాడు. బట్లర్ ఇప్పటివరకు 143.39 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేశాడు.
2 డెవాన్ కాన్వే : చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగమైన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వే.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు బ్యాట్‌తో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. కాన్వే బ్యాట్‌తో 9 ఇన్నింగ్స్‌లలో 59.14 అద్భుతమైన సగటుతో మొత్తం 414 పరుగులు చేశాడు. టాప్ ఆర్డర్‌లో కాన్వే జట్టుకు ఇప్పటి వరకు శుభారంభం అందించిన తీరుతో సీఎస్కే మిడిలార్డర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. ఈ సీజన్‌లో కాన్వే 5 అర్ధ సెంచరీలు చేశాడు.
Also Read : Flowers: మన్యం గిరుల్లో అరుదైన పుష్పాలు
3. కైల్ మేయర్స్ : క్వింటన్ డి కాక్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడకపోవడానికి అతిపెద్ద కారణం అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న కైల్ మేయర్స్. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ మేయర్స్ ఇప్పటివరకు మొత్తం సీజన్‌లో లక్నోకు అద్భుతమైన ప్రారంభాన్ని అందించడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. మేయర్స్ ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 37.12 సగటుతో 297 పరుగులు చేశాడు. ఈ క్రమంలో స్ట్రైక్ రేట్ 160.54గా నిలిచింది.
Also Read : Rain: విషాదం నింపిన వర్షం.. విద్యుత్ వైర్లు తెగిపడి కానిస్టేబుల్ మృతి
4. రషీద్ ఖాన్ : ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్ గా ఉన్నా.. లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు ఈ ఐపీఎల్ సీజన్ లో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన రషీద్ 32 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇందులో అతను 20 సగటుతో మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు.
5. నూర్ అహ్మద్ : అఫ్గాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా గుజరాత్ టైటాన్స్ నుంచి ఈ సీజన్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం దక్కించుకున్నాడు. చైనామన్ బౌలర్‌గా తనదైన ముద్ర వేసిన నూర్ అహ్మద్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో 13.12 సగటుతో మొత్తం 8 వికెట్లు తీసుకున్నాడు. దీంతో నూర్ ఎకానమీ రేటు 7.07గా నిలిచింది.