ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తమ జట్టు అద్భుతంగా ఆడుతోందని సంజూ శాంసన్ అన్నాడు. టీమ్ మంచి ఫాంలో ఉందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ వెల్లడించాడు. తొలుత బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ బ్యాటర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్ లు తమ ఫామ్ ను కొనసాగిస్తున్నారు. తొలి ఓవర్ వేసిన కామెరూన్ గ్రీన్ వేసిన మూడో బంతిని జైశ్వాల్ సిక్స్ గా కొట్టాడు. మొత్తం ఈ ఓవర్ లో 8 పరుగుల వచ్చాయి.
Also Read : CSK vs PBKS: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ
ఇక రెండు ఓవర్ వేసేందుకు వచ్చిన జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో యశస్వి జైశ్వాల్ రెండు సిక్సులు కొట్టడంతో ఈ ఓవర్ లో మొత్తం 11 పరుగులు వచ్చాయి. 2 ఓవర్లకే రాజస్థాన్ రాయల్స్ స్కోర్ 19/0గా ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. నాలుగో ఓవర్ వేస్తున్న జోఫ్రా ఆర్చర్ తన బౌలింగ్ లో తొలి బంతికి ఫోర్ పోగా.. సెకండ్ బాల్ డట్ అయింది. మొత్తం ఈ ఓవర్ లో 16 పరుగులు వచ్చాయి.
Also Read : Akhil Akkineni: అఖిల్ కు ఆ దోషం ఉంది.. ఆమె మాట వింటే..వేణుస్వామి సంచలన కామెంట్స్
ఐదో ఓవర్ బౌలింగ్ వేసేందుకు వచ్చిన మెరిడెత్ బౌలింగ్ లో జైశ్వాల్ తొలి బంతినే ఫోర్ గా మలిచాడు. రెండు, మూడో బంతిని మెరిడెత్ డట్ చేశాడు. 4.4 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ ను రాజస్థాన్ రాయల్స్ అందుకుంది. మెరిడెత్ వేసిన ఐదో ఓవర్ ( 16 పరుగులు ) ముగిసే సరికి రాజస్థాన్ స్కోర్ 58 పరుగులు.. జైశ్వాల్ ( 35 ), బట్లర్ ( 10)తో క్రీజులో ఉన్నారు.