ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్ లో విజయం సాధించిన సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్ కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. దీంతో ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కూడా గెలవడం సన్‌రైజర్స్‌కు కీలకమే. ఈ మ్యాచ్‌లో గెలిచి నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో హైదరాబాద్ కనిపిస్తోంది.
Also Read : Guntur Crime: గుంటూరులో దారుణం.. గొడుగు ఇస్తానని పిలిచి ఆరేళ్ల బాలికపై..!
మరోవైపు కోల్‌కతాకు కూడా ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరింటిలో పరాజయం చవిచూసింది. వరుస ఓటములతో కోల్‌కతా తన ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఇటు సన్ రైజర్స్ టీమ్ ను బ్యాటింగ్ వీక్నెస్ వేధిస్తోంది. ముఖ్యంగా హ్యారీ బ్రూక్ ఆట దారుణంగా ఉంది.. సెంచరీ తప్ప మిగిలిన అన్ని మ్యాచ్ ల్లోనూ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇక బ్రూక్ ను పక్కన పెట్టాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.. అయితే ఏప్రిల్ 14న జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ పైనే హ్యారీ బ్రూక్ సెంచరీ చేశాడు. మరోవైపు అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్‌లు మాత్రమే నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నారు.
Also Read : SCO Meeting: ఎస్‌సీఓ సమావేశాలకు గోవా సిద్ధం.. హాజరుకానున్న పాకిస్తాన్ మంత్రి
ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి గురించి మాట్లడకపోవడం మంచిది. కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ కూడా స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోతున్నాడు. అటు కోల్‌కతాకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. వరుస ఓటములతో కోల్‌కతా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారీ స్కోర్లు సాధిస్తున్నా మ్యాచ్‌లను కాపాడుకోలేక పోయింది. ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లో ఓటములకు పుల్‌స్టాప్ పెట్టి ముందుకు సాగాలని కోల్‌కతా తహతహలాడుతోంది. ఇరు జట్లకు కీలకంగా మారిన ఈ మ్యాచ్‌లో విజయం ఎవరికీ దక్కుతుందో వేచిచూడాలి మరీ..