ఐపీఎల్‌లో సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓపెనర్ అరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే కోల్‌కతా ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో రెండు బౌండరీలు కొట్టి ఊపు మీద ఉన్న ఫించ్‌ను రాజస్థాన్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ అవుట్ చేశాడు. దాంతో సహనం కోల్పోయిన ఫించ్ ప్రసిధ్ కృష్ణపై నోరు పారేసుకున్నాడు. పెవిలియన్‌కు వెళ్తూ సూటిపోటి మాటలతో కవ్వించాడు. ఈ నేపథ్యంలో ప్రసిధ్…
ఐపీఎల్‌లో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ చాహల్ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు. ఓవరాల్‌గా మాత్రం ఐపీఎల్ చరిత్రలో చాహల్ నమోదు చేసింది 21వ హ్యాట్రిక్ కావడం విశేషం. చాహల్ కంటే ముందు పలు ఆటగాళ్లు హ్యాట్రిక్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. అటు రాజస్థాన్ తరఫున హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్లలో చాహల్ 5వ ఆటగాడు.…
వరుస విజయాలతో ఐపీఎల్ 2022లో తన సత్తా చాటుకుంటోంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఆదివారం ఐపీఎల్ మెగా లీగ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో గెలుపొంది తనకు తిరుగులేదని నిరూపించింది. పంజాబ్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ బ్యాటర్లు అభిషేక్…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. గతంలో విరాట్ కోహ్లీ మాదిరిగా వరుస పరాజయాలను చవి చూస్తున్నాడు. ఈ సీజన్‌లో ముంబై టీమ్ వరుసగా ఆరు పరాజయాలను మూటగట్టుకుంది. దీంతో రోహిత్ కెప్టెన్సీపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో ఐపీఎల్ విజయాల కారణంగానే అతడికి టీమిండియా కెప్టెన్సీ అవకాశం వచ్చిందనేది అక్షర సత్యం. మరి ఇప్పుడు రోహిత్ వరుసగా విఫలం అవుతున్న నేపథ్యంలో రానున్న టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ టీమిండియాను ఎలా…
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు రూ.12లక్షలు జరిమానా పడింది. ముంబై ఇండియన్స్‌తో శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్ రేట్ కారణంగా కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫీజులో కోత పడింది. కాగా ఈ మ్యాచ్‌లో ముంబైపై లక్నో జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో సెంచరీ చేసిన రాహుల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో తాను ఆడుతున్న వందో…
ఐపీఎల్‌లో భాగంగా శనివారం జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్లనే విజయం వరించింది. తొలి మ్యాచ్‌లో టార్గెట్ ఛేదించడంలో ముంబై ఇండియన్స్ చతికిలపడగా.. రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బొక్కా బోర్లా పడింది. ఓ దశలో వార్నర్ (66) పోరాటంతో గెలిచేలా కనిపించిన ఢిల్లీ చేతులారా వికెట్లు కోల్పోయి పరాజయాన్ని కొనితెచ్చుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిర్ణీత…
ఐపీఎల్ 15వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆటతీరు ఏ మాత్రం మారడం లేదు. దీంతో టోర్నీలో ఆ జట్టుకు వరుసగా ఆరో ఓటమి ఎదురైంది. శనివారం సాయంత్రం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్(6), ఇషాన్(13) విఫలమయ్యారు. బ్రెవిస్ (31), సూర్య కుమార్ యాదవ్ (37), తిలక్ వర్మ(26) రాణించినా భారీ స్కోర్లు…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు. 56 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ చివరి వరకు నిలబడి 103 నాటౌట్‌తో నిలిచాడు. కేఎల్ రాహుల్‌కు డికాక్ (24), మనీష్…
ఐపీఎల్‌లో ఒక్కసారిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సీజన్‌లో అత్యంత బలహీనంగా కనిపించిన జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ అని అందరూ ముక్త కంఠంతో చెప్పారు. అంచనాలకు తగ్గట్లే తొలి రెండు మ్యాచ్‌లలో ఆ జట్టు ఓటమి పాలైంది. అయితే తరువాతి మూడు మ్యాచ్‌లలో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్…
ఈ ఏడాది ఐపీఎల్‌లో బలమైన జట్టుగా ముద్రపడిన ముంబై జట్టు ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు అన్నింట్లోనూ పరాజయం పాలైంది. ఈరోజు ఆరో మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్‌జెయింట్స్ జట్టుతో ముంబై తలపడనుంది. ఈ మేరకు టాస్ గెలిచిన రోహిత్ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో అయినా ముంబై బోణీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. తుది జట్లు: ముంబై: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, డెవాల్డ్…