IPL 2022: తిరుగులేని సన్ రైజర్స్ .. పంజాబ్‌పై 7వికెట్ల తేడాతో గెలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస విజయాలతో ఐపీఎల్ 2022లో తన సత్తా చాటుకుంటోంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఆదివారం ఐపీఎల్ మెగా లీగ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో గెలుపొంది తనకు తిరుగులేదని నిరూపించింది. పంజాబ్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, విలియమ్సన్లపై విరుచుకుపడ్డారు. అభిషేక్ శర్మను(31) షారుక్‌ఖాన్ పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్ కెప్టెన్ విలియమ్సన్(3) పరుగులే ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్త్రిపాఠి(34) మెరుగ్గా రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మార్క్రమ్(41), నికోలస్ పూరన్(35) నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించారు. పంజాబ్ బౌలర్లలో రబాడ 2 వికెట్లు తీయగా.. రబాడ ఓ వికెట్ తీశాడు.
తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్(8) పరుగులే చేశాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్(14) పరుగులకే ఓటయ్యాడు. లివింగ్ స్టోన్(60), షారుక్ ఖాన్(26) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 151 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఆఖరి ఓవర్‌లో ఉమ్రాన్ ఏకంగా 3 వికెట్లు తీసి ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఆఖరి బంతికి అర్షదీప్ కూడా రనౌట్ కాగా.. ఈ ఓవర్‌లో పంజాబ్ మొత్తం 4 వికెట్లు కోల్పోయి ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది.ఇప్పటిదాకా ఆరు మ్యాచ్ లు ఆడి నాలుగు విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానంలో వుంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
తాజావార్తలు
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!