ఐపీఎల్ లో ఢిల్లీ మెరుపులు మెరిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఐపీఎల్ లో తన సత్తా చాటుకుంటోంది. ఆదివారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, భారీ లక్ష్యఛేదనలో కోల్ కతా నైట్ రైడర్స్ 19.4 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్…
ఐపీఎల్ 2022 సీజన్‌లో నేడు మరో ఆసక్తికర పోరు జరుగుతోంది. ప్రస్తుత సీజన్‌లో విజయం కోసం ఎదరుచూస్తున్న సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ జట్లు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలినట్లైంది. 4వ ఓవర్ తొలి బంతికే రాబిన్ ఉతప్ప ఔట్ అయ్యి పెవిలియన్ చేరాడు. అంతేకాకుండా…
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు చాహల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 2013 ఐపీఎల్ సీజన్‌లో ఓ ఆర్‌సీబీ ప్లేయర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తు బాల్కనీలో వేలాడదీశాడని తెలిపాడు. ఏ తప్పిదం జరిగినా తాను అక్కడి నుంచి కిందపడి ప్రాణాలు కోల్పేయేవాడినని సంచలన విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఆ ప్లేయర్ పేరును చాహల్ వెల్లడించలేదు. తాజాగా చాహల్ వ్యాఖ్యలపై మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. చాహల్ సదరు ఆటగాడి పేరు…
ఐపీఎల్ ప్రసార మ్యాచ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రసార హక్కులను చేజిక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీ పడుతుంటాయి. ఈ మేరకు 2023-2027 నాలుగేళ్ల కాలానికి ప్రసార హక్కుల కోసం బీసీసీఐ త్వరలో టెండర్లను పిలవనుంది. అయితే ఈ టెండర్లు పిలవకముందే బీసీసీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్ వీక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు రిపోర్టులు వచ్చాయి. గత ఏడాదితో పోల్చుకుంటే తొలివారం వీక్షకుల సంఖ్య 33 శాతం పడిపోయింది. బార్క్ నివేదిక ప్రకారం గత…
వీకెండ్ సందర్భంగా ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లూ ఇప్పటివరకు టోర్నీలో బోణీ కొట్టలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి చెన్నై హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. సన్‌రైజర్స్ టీమ్ కూర్పుపై విమర్శలు వస్తుండటంతో ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విలియమ్సన్…
ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. నేడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ముంబయి బ్రాబౌర్న్ స్టేడియం వేదికగా తలపడుతున్నాయి. తాజా సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచిన గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ కోసం ఉరకలేస్తుండగా, టైటాన్స్ కు అడ్డుకట్ట వేయాలని పంజాబ్ కింగ్స్ ఆశిస్తోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్ ఫామ్‌లో ఉండగా.. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఆడిన…
ఐపీఎల్ 2022లో కొత్తగా ప్రవేశించిన లక్నోసూపర్ జెయింట్స్ టీమ్ జోరు కొనసాగుతోంది. గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బౌలింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసిన లక్నో.. అనంతరం బ్యాటింగ్‌లో డికాక్ భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో గెలుపు అందుకుంది. డికాక్ 52 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 80 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో…
ఐపీఎల్‌లో భాగంగా డీవై పాటిల్ స్టేడియం వేదికగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్వల్ప స్కోరు చేసింది. ఆరంభంలో అదరగొట్టిన ఆ జట్టు బ్యాటర్లు ఆ తర్వాత నెమ్మదిగా ఆడటంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. దీంతో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఢిల్లీ జట్టు సాధించిన స్కోరులో ఓపెనర్ పృథ్వీ షా ఒక్కడే 61 పరుగులు చేశాడు. కెప్టెన్ పంత్ 39 నాటౌట్, సర్ఫరాజ్ ఖాన్ 36…
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు వరుస ఓటములపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతటి గొప్ప కెప్టెన్ అయినా సరైన ఆటగాళ్లు లేకపోతే ఏం చేయలేడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ పరాజయాలకు రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఏం సంబంధం లేదని కైఫ్ అన్నాడు. తన దృష్టిలో రోహిత్ శర్మ గొప్ప సారథి అని స్పష్టం చేశాడు. సరైన ఆటగాళ్లు లేకుంటే జట్టులో ఎంతటి గొప్ప కెప్టెన్ ఉన్నా టీమ్‌ను…