ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో చేదు వార్త అందింది. మూలిగే నక్కపై తాడిపండు పడిన చందాన అసలే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి ఆ జట్టు నిరాశలో ఉండగా.. తాజాగా కెప్టెన్ పంత్‌కు జరిమానా పడింది. శుక్రవారం రాత్రి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆటగాళ్లను వెనక్కి రావాలని పిలిచిన రిషబ్ పంత్‌కు మ్యాచ్ ఫీజులో 100శాతం కోత పడింది. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా మ్యాచ్ మధ్యలో గ్రౌండ్‌లోకి వెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్…
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు, ఆ జట్టు ఓపెనర్ జాస్ బట్లర్ ఈ ఐపీఎల్ సీజన్‌లో మంచి ఊపు మీద కనిపిస్తున్నాడు. ఇప్పటికే టోర్నీలో మూడు సెంచరీలు చేశాడు. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే కేవలం 57 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్ 116 పరుగులు చేసి చివరి ఓవర్‌లో అవుటయ్యాడు. ఈ క్రమంలో బట్లర్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్‌తో కలిసి 155…
శుక్రవారం రాత్రి జరిగిన ఢిల్లీ-రాజస్థాన్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగింది. అయితే చివరి ఓవర్‌లో హైడ్రామా నడిచింది. ఢిల్లీ విజయానికి 36 పరుగులు కావాల్సిన తరుణంలో రోవ్‌మెన్ పావెల్ చెలరేగి ఆడాడు. రాజస్థాన్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ వేసిన 20వ ఓవర్లో తొలి మూడు బంతులకు పావెల్ 3 సిక్సర్లు కొట్టాడు. అయితే మూడో బంతికి మెకాయ్ వేసిన ఫుల్ టాస్ బంతిని అంపైర్ సరైన బాల్‌గానే ప్రకటించడంతో ఢిల్లీ జట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. చివరి 4 బంతుల్లో చెన్నై జట్టు 16 పరుగులు చేయాల్సిన స్థితిలో వరల్డ్ బెస్ట్ ఫినిషర్ ధోనీ మరోసారి తనదైన శైలిలో ఆడి మ్యాచ్‌ను గెలిపించాడు. వరుసగా 6, 4, 2, 4 సాధించాడు. దీంతో తనలో పవర్ తగ్గలేదని ధోనీ చాటిచెప్పాడు. అయితే ధోనీ ఇన్నింగ్స్‌పై మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం…
గురువారం రాత్రి చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే రోహిత్ శర్మ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్ ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో మొత్తం 14 సార్లు రోహిత్ డకౌట్ అయ్యాడు. రోహిత్ తర్వాత అత్యధికంగా 13 సార్లు డకౌట్ అయిన ఆటగాళ్లలో పీయూష్ చావ్లా, హర్భజన్, మన్‌దీప్ సింగ్, పార్థివ్ పటేల్, రహానే, అంబటి…
ఐపీఎల్ 2022 సీజన్‌లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. నేడు ముంబాయిలోని డీవై పాటేల్ స్టేడియం వేదికగా చైన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. అయితే టాస్ గెలిచి సీఎస్‌కే బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఈ రెండు జట్ల ప్రదర్శన ఆశించిన మేరకు లేనప్పటికీ, ఈ మ్యాచ్‌పై మాత్రం ఊహకందని హైప్ నెలకొంది. అయితే ముంబై ఇండియన్స్ తరుఫున బరిలోకి దిగిన రోహిత్ శర్మ మరోసారి నిరాపరిచి, డకౌట్‌గా వెనుదిరిగాడు. సీఎస్‌కేకు పేసర్…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 115 పరుగులకే ఆలౌటైంది. జితేష్ శర్మ (32), మయాంక్ అగర్వాల్ (24) టాప్ స్కోరర్లు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అనంతరం…
పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లూ ఇవాళ ఢీకొడుతున్నాయి. ఐపీఎల్ 2022లో భాగంగా జరుగుతున్న 32వ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ టాస్ గెలిచాడు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మిచెల్ మార్ష్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకున్నట్లు పంత్ తెలిపాడు. పంజాబ్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. మయాంక్ తిరిగి రావడంతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు.…
ఐపీఎల్ 2022 సీజన్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్రదర్శన బాగానే ఉన్నా ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట తీరే అభిమానులను అసంతృప్తికి గురిచేస్తోంది. ఆర్‌సీబీ ఫ్రాంచైజీ రూ.15 కోట్లు కుమ్మరించి కోహ్లీని రిటైన్ చేసుకుంది. అయితే అతడు మాత్రం పేలవ ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయంగానూ కోహ్లీ విఫలమవుతున్నా.. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేస్తాడని బెంగళూరు ఫ్రాంచైజీ నమ్మకం పెట్టుకుంది. కానీ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 23.80గా…
ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్‌లో నువ్వా నేనా అనే విధంగా జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఈ సీజన్‌లో భాగంగా నేడు ఆసక్తికర పోరు జరిగింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జెయింట్ తలపడిందిం. అయితే టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకోగా రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు బ్యాటింగ్‌కు దిగారు. ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181…