ఐపీఎల్‌లో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ చాహల్ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు. ఓవరాల్‌గా మాత్రం ఐపీఎల్ చరిత్రలో చాహల్ నమోదు చేసింది 21వ హ్యాట్రిక్ కావడం విశేషం. చాహల్ కంటే ముందు పలు ఆటగాళ్లు హ్యాట్రిక్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. అటు రాజస్థాన్ తరఫున హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్లలో చాహల్ 5వ ఆటగాడు. గతంలో చండీలా, ప్రవీణ్ తంబే, వాట్సన్, శ్రేయస్ గోపాల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున హ్యాట్రిక్ సాధించారు.
ఓవరాల్‌గా చూసుకుంటే.. 2008లో లక్ష్మీపతి బాలాజీ, అమిత్ మిశ్రా, ఎన్తిని.. 2009లో యువరాజ్ (రెండు సార్లు), రోహిత్ శర్మ, 2010లో ప్రవీణ్ కుమార్, 2011లో అమిత్ మిశ్రా, 2012లో అజిత్ చండీలా, 2013లో అమిత్ మిశ్రా, సునీల్ నరైన్, 2014లో ప్రవీణ్ తంబే, షేన్ వాట్సన్, 2016లో అక్షర్ పటేల్, 2017లో శామ్యూల్ బద్రీ, ఆండ్రూ టై, జయదేవ్ ఉనద్కట్, 2019లో శామ్ కరణ్, శ్రేయాస్ గోపాల్, 2021లో హర్షల్ పటేల్, 2022లో చాహల్ హ్యాట్రిక్ వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఉన్నారు.
IPL 2022 : మలుపు తిప్పిన చహల్.. రాజస్తాన్ రాయల్స్ విజయం..