గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. బాంరగడ్ తాలుక జూవి గ్రామానికి చెందిన పూసు పుంగంటి (52) అనే వ్యక్తిని మావోలు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం మేరకు, ఓ వివాహ వేడుకకు వెళ్లిన పూసు పుంగంటిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి, అనంతరం హత్య చేశారు. అతను పోలీసులకు సహకరిస్తున్నాడనే అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాంరగడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టుల హత్యాకాండపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు పెరుగుతుండటంతో భద్రతా దళాలు కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాయి.
READ MORE: Pakistan: పాకిస్తాన్‌ని మందలించిన యూఎస్, సౌదీ.. దాయాది ముందు కాశ్మీర్ సహా 5 డిమాండ్లు
ఇదిలా ఉండగా.. దండకారణ్యంలో శనివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈక్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు 16 మందిని హతమార్చారు. ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. కెర్లపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్‌గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. గాయపడిన సిబ్బంది డీఆర్‌జీ విభాగానికి చెందిన వారిగా పేర్కొన్నారు.
READ MORE: Pakistan: పాకిస్తాన్‌ని మందలించిన యూఎస్, సౌదీ.. దాయాది ముందు కాశ్మీర్ సహా 5 డిమాండ్లు