విశాఖపట్నం వేదికగా ‘విశ్వమంతా యోగాతో ఆరోగ్యం’ నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత భారీగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. యోగాంధ్ర 2025కు విస్తృత ప్రచారం కల్పించడం, భారీ సంఖ్యలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు నెల రోజుల కార్యాచరణ ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగా ఈరోజు బాపట్ల పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో యోగాంధ్ర క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ క్యాంపెయిన్లో మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్,…
యోగాలో ఏపీ ట్రెండ్ సెటర్‌గా ఉండాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్కూళ్లు తెరిచిన వెంటనే యోగా ప్రారంభం అవ్వాలన్నారు.. ఒక సిలబస్ గా యోగ ఉండాలన్నారు.. గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి యోగాపై ప్రచారం నిర్వహిస్తామన్నారు.. ఒత్తిడి తగ్గించడానికి యోగా ఒక్కటే మార్గం అన్నారు సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ యోగా డేలో 2 కోట్ల మంది భాగస్వామ్యం కావాలన్నారు.. ప్రధాని మోడీ యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు..
ప్రపంచరికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే వేడుకల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహిస్తుండగా.. విశాఖలోని ఆర్కే బీచ్ లో వందల మందితో ప్రాథమిక వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ గణ బాబు, కలెక్టర్, సిటీ పోలీసు కమిషనర్ పాల్గొన్నారు. జూన్ 21 విశాఖలో జరిగే యోగా డే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.. వేలాది మందితో కలిసి ఆయన యోగాసనాలు వేయనున్నారు..
మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహించాలి అన్నారు సీఎం చంద్రబాబు.. విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డే ను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని అన్నారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈసారి విశాఖలో పాల్గొంటున్నారు.
Family In Guinness World Records: చైనా దేశంలో చాంగ్షా నగరంలో నివసించే ఒక భారతీయ తెలుగు కుటుంబం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరి పేరు గినిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు అయ్యాయి. ఇలా రికార్డ్ సాధించడం ప్రపంచంలోని ఎకైక కుటుంబం. కుటుంబంలో ప్రతి వ్యక్తి దగ్గర తన స్వంత వరల్డ్ రికార్డు ఉంది. ఈ కుటుంబం రికార్డులను యోగ, క్రీడా రంగాల్లో సాధించింది. విజయ్, అతని భార్య కోనతాల…
International Yoga Day: ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రతి ఏటా జూన్ 21 న జరుపుకునే యోగా దినోత్సవానికి ప్రాచీన భారతదేశం నుండి ప్రపంచ సాధన వరకు యోగా యొక్క ప్రాముఖ్యత ఉంటుంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని మైసూర్ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో వేకువజామునుంచే ప్రముఖులు సహా సామాన్య ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు. మానవత్వం కోసం యోగా(Yoga for humanity) అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కర్ణాటకలో ప్రధాని మోదీ ఈవెంట్‌లో సుమారు 15 వేల మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి సర్భానంద…
ఈ నెల 21న (రేపు) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ తన సందేశం ఇచ్చారు. ఆరోగ్యం.. శ్రేయస్సు కోసం ప్రజలు యోగాను తప్పకుండా ఆచరించాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. గుండెపోటు, స్ట్రోక్, థైరాయిడ్, మధుమేహం తదితర జీవన శైలి వ్యాధులు నేటి తరంలో పెరిగిపోతున్నందున యోగాకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని, తమ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరారు. యోగాకు సంబంధించి వీడియోను షేర్…