Pranava Group: హైదరాబాద్ మహానగరంలో నిర్మాణ రంగం ఎప్పటికప్పుడు రూటు మారుస్తూనే ఉంది.. ఇండిపెండెంట్‌హౌస్‌లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు.. అంతెందుకు నగరం నడి బొడ్డులోనే సరికొత్త గేటెడ్ కమ్యూనిటీలు.. ఇలా ఎన్నో మార్పులు సంతరించుకుంటున్నాయి.. ఇక, నిర్మాణ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ప్రణవ గ్రూప్.. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త అనుభూతిని కలిగించేలా నిర్మాణాలు చేపడుతోంది.. మరోవైపు.. తమ గ్రూప్‌లోని ఉద్యోగులు, సిబ్బందిని.. సామాజిక మరియు సాంస్కృతిక అంశాలలో ప్రోత్సహిస్తుంది.. ఇక, ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది ప్రణవ గ్రూప్..
Read Also: Triple Talaq: బీజేపీకి సపోర్ట్ చేసినందుకు భార్యకు ‘‘ట్రిపుల్ తలాక్’’
హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రణవ గ్రూప్ కార్యాలయం పరిసరాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం జరిగింది.. 21వ తేదీన సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల మధ్య జరిగిన ఈ యోగా కార్యక్రమంలో ఆధ్యాత్మిక యోగా గురువు ప్రతాప్ గురుజీ పాల్గొని.. ప్రణవ గ్రూప్ ఉద్యోగులు, సిబ్బందితో యోగాసనాలు వేయించారు.. యోగా శక్తి, యోగాతో ఉండే ప్రయోజనాలను, యోగా ప్రత్యేకతల గురించి వివరిస్తూ.. అందరితో యోగాసనాలు వేయించారు.. ఇక, ఈ కార్యక్రమంలో ప్రణవ గ్రూప్ ఎండీ రాంబాబు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: Leopard Attack: మాజీ సర్పంచ్‌ని చంపేసిన చిరుత.. తల మొత్తం..!
కాగా, ఆధునిక సమాజంలో.. వచ్చిన మార్పులతో కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం అంటూ అంతా పరుగులు పెడుతున్నారు.. దానికి తోడు తీసుకునే ఆహారంలో అనేక మార్పులు వచ్చి.. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి.. ఈ తరుణంలో.. యోగా సాధన ఎంతో ఉపయోగంగా ఉంది.. యోగా అంటే శరీరాన్ని మెలికలు త్రిప్పటం లేక తల్లక్రిందులుగా నుంచోవటం కాదు.. యోగా అనేది ఒక వ్యాయామ పద్ధతి కాదు,. అది మనిషిని తను చేరుకోగల అత్యునత్త స్థితికి చేరవేసే ఒక సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం.. అసలు యోగా అంటే ఐక్యం అని చెబుతారు.. ఇక, అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు. 2014 సెప్టెంబర్ 27న భారత ప్రధాని మోడీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేయగా.. ఈ తీర్మానానికి ఐరాస ప్రతినిధులు మద్దతు తెలిపారు.. 2015 జూన్ 21 న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయం విదితమే.