విశాఖపట్నం వేదికగా ‘విశ్వమంతా యోగాతో ఆరోగ్యం’ నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత భారీగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. యోగాంధ్ర 2025కు విస్తృత ప్రచారం కల్పించడం, భారీ సంఖ్యలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు నెల రోజుల కార్యాచరణ ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగా ఈరోజు బాపట్ల పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో యోగాంధ్ర క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ క్యాంపెయిన్లో మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు యోగాసనాలు వేశారు.
Also Read: AP Rains: రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు: ఐఎండీ
మంత్రి పార్దసారథి మాట్లాడుతూ… ‘యోగా అందరి జీవితాల్లో భాగం కావాలి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాలన్న ప్రధాని మోడీ ప్రతిపాదనను 177 దేశాలు ఆమోదించాయి. యోగా వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలప విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. జూన్ 21న వైజాగ్ నగరంలో 5 లక్షల మందితో యోగా కార్యక్రమంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగా ద్వారా ప్రయోజనాలు పొందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది’ అని అన్నారు.