Pakistan: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న విదేశీ నిల్వలు, స్థానిక కరెన్సీ పతనం కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి మరోసారి సహాయం చేసేందుకు రెడీ అయింది. దీంతో పాక్ లో పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టవచ్చు అని అభిప్రాయ పడింది.
World Economy in 2023: ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోందనే ప్రశ్నకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సవివరంగా సమాధానం చెప్పింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి తక్కువగా ఉంటుందని, అదే సమయంలో ద్రవ్యోల్బణం కూడా దిగొస్తుందని అంచనా వేసింది. ఈ మేరకు లేటెస్ట్ వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ పేరిట రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. ఎక్కువ దేశాల్లో జీవన వ్యయ సంక్షోభం నెలకొంటుందని, అయినప్పటికీ ద్రవ్యోల్బణం పెరగకుండా చూసుకునేందుకే ఆయా ఆర్థిక వ్యవస్థలు ప్రాధాన్యత ఇస్తాయని…
ఆర్థిక సంక్షోభం పాకిస్థాన్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాక్ ప్రజలపై మరో బాంబు పేలింది. ఆ దేశ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచింది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌కు రూపాయి భారీ షాక్ ఇచ్చింది. దీంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంలా తయారైంది పాక్ పరిస్థితి.
Today (03-01-23) Business Headlines: పబ్లిక్ ఇష్యూకి హైదరాబాద్ సంస్థ: బ్యాంకులతో కలిసి ప్రీపెయిడ్ కార్డులను జారీచేసే హైదరాబాద్ సంస్థ జాగల్ ప్రీపెయిడ్ ఓవర్సీస్ సర్వీసెస్.. పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఫేస్ వ్యాల్యూ రూపాయితో కొత్త షేర్లను కేటాయించటం ద్వారా 490 కోట్ల ఫండ్‌రైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి తెలిపింది.
Interest Rates: ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని సాధారణ స్థితికి తెచ్చే వరకూ వడ్డీ రేట్లు పెంచుతూ పోవాలని సెంట్రల్ బ్యాంకులకు ఆమె సూచించారు. యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచబోతుందన్న అంచనాల మధ్య ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా ఈ సలహా ఇచ్చారు. వడ్డీ రేట్ల పెంపు ద్వారా ప్రపంచవ్యాప్తంగా సానుకూల ప్రభావం రావాలంటే 2024 వరకు ఆగాల్సి ఉంటుందన్నారు. ద్రవ్యోల్బణం…
Sri Lankan children suffering from hunger: శ్రీలంక దేశ ఆర్థిక కష్టాలు ఇప్పటికిప్పుడే తీరేలా లేవు. గత మార్చి నుంచి శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారింది. నిత్యవసరాల ధరలు అమాంతం పెరిగాయి. పెట్రోల్, డిజిల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. పనులు లేక మహిళలు వ్యభిచారులుగా మారుతున్న దయనీయ పరిస్థితులు శ్రీలంకలో చూస్తున్నాం. శ్రీలంక ఖజానాలో విదేశీమారక నిల్వలు అడుగంటుకుపోయాయి. ఇతర దేశాల నుంచి నిత్యావసరాలను తెప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. తమను ఆదుకోవాలని ఐఎంఎఫ్ ను…