Pakistan Crisis: పాక్‌లో మరింత ముదిరిన సంక్షోభం.. మంత్రులు, ఉద్యోగాల్లో కోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan To Cut Govt Employees Salaries And Ministers Allowance: ప్రస్తుతం పాకిస్తాన్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పాక్‌లో కేవలం మూడంటే మూడు వారాలకు మాత్రమే సరిపడా మాదకద్రవ్యం అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలోనే.. ఖర్చులు తగ్గించుకునేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే షరీఫ్ ఇప్పటికే జాతీయ పొదుపు కమిటీ (National Austerity Committee)ని ఏర్పాటు చేశారు. తాజాగా ఆ కమిటీ కొన్ని పరిశీలనలు చేసి.. ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్టు అక్కడి మీడియా సంస్థ వెల్లడించింది.
Boyfriend Crime: మరో వ్యక్తితో పెళ్లి.. గొంతు కోసిన ప్రియుడు
Also Read
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించడంతో పాటు మంత్రిత్వ శాఖలు, వాటి సంబంధిత విభాగాల ఖర్చుకు 15 శాతం కోత పెట్టాలని.. ఆ కమిటీ ప్రధాని షరీఫ్‌కి ప్రతిపాదించినట్టు ఆ మీడియా సంస్థ పేర్కొంది. అంతేకాదు.. మంత్రుల సంఖ్యను 78 నుంచి 30కి తగ్గించాలని, సలహాదారుల సంఖ్యను సైతం కుదించాలని ఆ కమిటీ పరిశీలిస్తోంది. ఆపై మిగిలిన వారు స్వచ్ఛందంగా పని చేయాల్సి ఉంటుందని ఆ కమిటీ తన ప్రతిపాదనలో తెలిజేసినట్టు ఆ వార్తా కథనం పేర్కొంటోంది. ఇప్పుడున్న ఆర్థిక సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందాలంటే.. ఈ కోత, వేటు మార్గాలనే అత్యుత్తమమని ఆ కమిటీ ప్రతిపాదించినట్టు సమాచారం. మరి.. పాక్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
Akkineni Nagarjuna: ఏమయ్యా నాగార్జున.. తండ్రి వివాదం కన్నా పెళ్లి వేడుక ముఖ్యమా..?
మరోవైపు.. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) సహాయం కోసం పాక్ ఎదురుచూస్తోంది. కానీ.. ఆ సంస్థ పెట్టే నిబంధనల్ని పాటించేందుకు మాత్రం పాక్ విముఖత వ్యక్తం చేస్తుంది. గత రెండున్నర నెలల నుంచి ఐఎంఎఫ్, పాక్ మధ్య ఈ పరిస్థితి కొనసాగుతుంది. అటు.. ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు గాను పాక్ ఇప్పటికే కొన్ని పొదుపు చర్యల్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా కరెంటు కోతలు విధిస్తుండటంతో పాటు ప్రభుత్వ అధికారుల పనివేళలను కుదించింది. రాత్రివేళల్లో వేడుకలపై నిషేధం విధించి. మాల్స్, ఫ్యాక్టరీలు కూడా త్వరగా మూసివేయాలని ఆదేశించింది. పాలకుల అవినీతి, కరోనా, ప్రకృతి విపత్తులే ఆ దేశాన్ని గట్టిగా దెబ్బతీశాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!