ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే 5 నుంచి ప్రారంభం కానున్నాయి అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 5 నుంచి 19 వరకు 98% పరీక్షలు పూర్తి అవుతాయి. 11 పని దినాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పరీక్షల సామాగ్రి అంతా ఆ యా పరీక్షా కేంద్రాలకు చేరుతున్నాయి. తూర్పుగోదావరి లో అత్యధిక, గుంటూరు లో అతి తక్కువ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఒక కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ ఉంటారు. మొబైల్ మెడికల్ వ్యాన్లు, ధర్మల్ స్క్రీనింగ్, మాస్క్ లు కూడా అందుబాటులో ఉంచుతున్నాం. వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఒక పారా మెడికల్ సిబ్బంది ప్రతి పరీక్షా కేంద్రంలో ఉంటారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇంటర్ పరీక్షలను రద్దు చేయలేదు. ఇది కఠినమైన నిర్ణయమే అయినా పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ముందుకు వెళుతోంది అని తెలిపారు.