మద్యం మత్తులో యువకులు ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు ఎన్ని సార్లు చెబుతున్నా.. ఆమాటలను బేఖాతరు చేస్తున్నారు మందుబాబులు.
మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. స్థానిక సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి యువకులను చెదరగొట్టారు. ఈఘటన వరంగల్ లోని పోచమ్మ మైదాన్ లో చోటుచేసుకోవడంతో కలకలం రేపింది.