Indus Waters Treaty: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ‘‘సింధూ నది ఒప్పందాన్ని’’ నిలిపేసింది. సింధూ నది జలాలను ఆపితే యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ బీరాలు పలికింది. ఇదిలా ఉంటే, తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రచురించిన నివేదికలో సింధూ నది జలాలు ఆపితే, పాకిస్తాన్‌కు తీవ్రమై దెబ్బ పడుతుందని చెప్పింది. పాకిస్తాన్ తీవ్రమైన నీటి కొరత ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని ఎకలాజికల్ థ్రెట్ రిపోర్ట్-2025 పేర్కొంది.
Indus River: సింధు నది జలాల కోసం కేంద్రం కొత్త ప్లాన్‌తో సిద్ధమవుతోంది. ఉత్తరాది రాష్ట్రాల దాహార్తిని, సాగు అవసరాలను తీర్చేందుకు కేంద్రం సింధు నది వ్యవస్థలో భారీ మార్పులు చేయాలని భావిస్తోంది. పాకిస్తాన్‌తో ‘‘సిందు జల ఒప్పందాన్ని’’ నిలిపేసిన తర్వాత, కేంద్రం ఈ వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. 2029 లోక్‌సభ ఎన్నికల ముందు ఈ ప్రాజెక్ట్ సిద్ధం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. గత శుక్రవారం సీనియర్ మంత్రులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో సింధు నదిని…
Pakistan: పాకిస్తాన్‌కి కొత్త సంక్షోభం వచ్చి పడింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, తిరుగుబాటు, ఉగ్రవాదంతో సతమతం అవుతున్న ఆ దేశాన్ని ఇప్పుడు ‘‘నీటి సంక్షోభం’’ భయపెడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960 నాటి ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. దీని ప్రభావం ప్రస్తుతం పాకిస్తాన్ లో స్పష్టంగా కనిపిస్తోంది. సింధు, జీలం, చీనాబ్ నదులతో కూడిన సింధు నది వ్యవస్థలో నీటి కొరత కనిపిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్‌లో ఖరీఫ్(వానాకాలం పంటల) విత్తే కాలం దగ్గర పడుతున్న…
Indus water: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్తాన్‌కి సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు, దాని ఉపనదులు నుంచి ఒక్క చుక్క నీరు దక్కకుండా భారత్ వ్యూహాన్ని రూపొందిస్తోంది. ఇప్పటికే 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. పాకిస్తాన్ భారత్ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. ఇది ‘‘యుద్ధ చర్య’’గా అభివర్ణించింది. సింధు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న నిర్ణయాన్ని భారత్, పాక్ ప్రభుత్వానికి అందించింది.
Indus Water Treaty: దాయాది దేశం పాకిస్తాన్ భారత్‌పైకి ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూనే ఉంది. మంగళవారం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్‌లో సాధారణ టూరిస్టులను టార్గెట్ చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు తామే పాల్పడినట్లుగా పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రమేయాన్ని భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి.
Pakistan: ఆర్థిక సంక్షోభం, అప్పులు, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కి జాక్‌పాట్ తగిలింది. సింధునదిలో ‘‘బంగారు నిల్వలు’’ ఉన్నట్లు తేలింది. ప్రాచీన సింధు లోయ నాగరికతకు ఈ నది తల్లిగా ఉంది. అద్భుతమైన నాగరికత ఈ నదీ ఒడ్డునే వెలిసింది. మెహంజోదారో, హరప్పా వంటి గొప్ప నగరాలు ఈ నాగరికతలో వెలిశాయి. ఋగ్వేదంలో కూడా సింధు నదీ ప్రస్తావన ఉంది. క్రీస్తుపూర్వం 3300-1300 మధ్య హరప్పా నాగరికతకు కీలకంగా సింధునది ఉంది.
Indus Water Treaty: దాయాది దేశం, ఉగ్రవాదుల ఉత్పత్తి కర్మాగారంగా ఉన్న పాకిస్తాన్‌కి భారతదేశం మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ‘‘సింధు జల ఒప్పందాన్ని’’ సమీక్షించాలని పాకిస్తాన్‌కి నోటీసులు పంపింది. ప్రజల ఆందోళనలు, జనాభా మార్పులు, పర్యావరణ సమస్యలు, శక్తి అవసరాలకు అనుగుణంగా సమీక్షించాలని నోటీసులు జారీ చేసింది. పాకిస్తాన్ పదేపదే భారత్ లక్ష్యంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న తరుణంలో ఈ చర్య వచ్చింది.
Pakistan appeals for urgent aid from international community: పాకిస్తాన్ దేశాన్ని భారీ వరదలు తీవ్రంగా ముంచెత్తాయి. అసలే ఆర్థిక పరిస్థితులు బాగా లేక కొట్టుమిట్టాడుతున్న ఆ దేశాన్ని వరదలు మరింతగా నష్టపరిచాయి. ఏంతలా అంటే ప్రస్తుతం పాకిస్తాన్ లోని మూడోంతుల్లో ఒక వంతు భూభాగం పూర్తిగా నీటితోనే నిండి ఉంది. సింధు నది దాని ఉపనదులు పొంగిపొర్లడంతో సింధ్ ప్రావిన్స్, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది. జూన్ మధ్య నుంచి ఇప్పటి వరకు…
PAKISTAN FLOODS-one third of Pakistan underwater: అసలే ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ పరిస్థితి వరదల కారణంగా దారుణంగా మారింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు ఈ ఏడాది రుతుపవన కాలంలో కురిశాయి. దీంతో పాకిస్తాన్ లో ఒక్కసారిగా భీకర వరదలు సంభవించాయి. సింధు నదితో పాటు దాని ఉపనదులు, స్వాత్ నదులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో సింధ్ ప్రావిన్స్, బలూచిస్థాన్ ప్రావిన్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు ఖైబర్…