గృహా నిర్మాణ శాఖ కార్యకలాపాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి గృహ నిర్మాణశాఖ సెక్రటరీ శ్రీనివాసరాజు, స్పెషల్ సెక్రటరీ & గృహ నిర్మాణ సంస్థ ఎండీ విజయేంద్ర బోయి, గృహ నిర్మాణ సంస్థ, గృహ నిర్మాణ మండలి, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో 4 వేల కోట్ల ఇందిరమ్మ ఇంటి పెండింగ్ బిల్లులను కట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ రుణన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.25 వేలు చెల్లించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండల్లో ఓటు అడిగే హక్కు తమకే ఉందని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి గత కొద్దికాలంగా మౌనంగా వున్నారు. తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఎక్కడికి పోలేదు. నివురు గప్పిన నిప్పులా కాచుకుని ఉన్నా అన్నారు. గ్రూపు రాజకీయాలు వద్దనే నేను సైలెంట్ గా ఉన్నాను. నా కంటే బెటర్ గా చేస్తారని వెయిట్ చేశాను. గెలుపు కోసం జిల్లాలు మార్చే నేతలు ఉన్నారు. గెలిచినా, ఓడినా నేను ఖమ్మం ఆడ బిడ్డగానే ఉంటానన్నారు. నాకు పదవులు ముఖ్యం…