దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభం అందరికీ తెలిసిందే. గత ఐదు రోజులుగా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు వర్ణించలేనివి. తిండి తిప్పలు లేకుండా ఎయిర్‌పోర్టుల్లో నరకయాతన పడుతున్నారు. ఇదేం దుస్థితి బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు.
ఇండిగో ఎయిర్‌లైన్ సంక్షోభం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది.
Indigo Crisis: ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంక్షోభానికి కారకులైన వారిని గుర్తించి, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చింది.