IndiGo: పార్లమెంట్‌లో పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇండిగోపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోమని, ప్రజల భద్రత విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండిగోకి DGCA నోటీసులు జారీ చేసిందని, ప్రయాణికుల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యం అని, ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని DGCAను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే ఇండిగో సీఈవో,…