18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈరోజు (సోమవారం) ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. సెషన్‌కు ముందు ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. సభ్యులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు ప్రజాస్వామ్యానికి గర్వకారణమని అభివర్ణించారు. అంతేకాకుండా.. ఎమర్జెన్సీని ప్రస్తావించారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా జీవించడం గురించి మాట్లాడారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈరోజు అద్భుతమైన రోజు అని ప్రధాని మోడీ అన్నారు.
PM Narendra Modi: భారతదేశ ప్రజాస్వామ్య విజయం, ప్రజాస్వామ్య సంస్థల విజయం కొంతమందిని బాధిస్తోందని, అందుకు వారు ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ శనివారం అన్నారు. ఇటీవల ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశం ఆత్మ విశ్వాసం, సంకల్పంతో ముందుకు వెళ్తూ, ప్రపంచంలోని మేధావులు భారత్ పట్ల ఆశాజనకంగా ఉండే సమయంలో కొందరు నిరాశవాదం, దేశాన్ని తక్కువ చేసేలా, దేశ నైతికత దెబ్బతినేలా మాట్లాడుతున్నారని ఆయన…