అగ్ర రాజ్యం అమెరికాలోని మెక్సికోలో సైన్యం జరిపిన కాల్పుల్లో భారతీయుడి సహా ఆరుగురు వలసదారులు మృతిచెందారు. ట్రక్కులో వెళ్తుండగా కాల్పులు జరపడంతో సంఘటనాస్థలిలో నలుగురు చనిపోగా.. చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. వీళ్లంతా భారత్, నేపాల్, పాకిస్థాన్, తదితర దేశాల నుంచి వలసవచ్చినవారిగా తెలుస్తోంది.
ఆపిల్ తన రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఐఫోన్ 16 లాంచ్ తేదీని ప్రకటించింది. దీనితో పాటు, తమ సీఎఫ్‌ఓ లూకా మేస్త్రి తన పదవికి రాజీనామా చేసినట్లు కూడా కంపెనీ తెలియజేసింది. లూకా స్థానంలో భారత సంతతికి చెందిన కేవన్ పరేఖ్ కొత్త సీఎఫ్ఓగా నియమితులయ్యారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. పోలాండ్ నుంచి నేరుగా రైలులో శుక్రవారం ఉదయం కీవ్ చేరుకున్నారు. కీవ్‌కు చేరుకున్న ఆయనకు భారతీయ కమ్యూనిటీ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
రష్యాకు సహాయం చేసినందుకు గాను భారత టెక్నాలజీ కంపెనీతో సహా పలు దేశాలకు చెందిన 10 కంపెనీలపై జపాన్ నిషేధం విధించింది. పాశ్చాత్య దేశాలు, వారి మిత్రదేశాలు ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై కఠినమైన వాణిజ్య, ఆర్థిక ఆంక్షలు విధించాయి.
క్యాన్సర్ అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి, ఇది సరైన సమయంలో గుర్తించబడకపోతే చికిత్స చేయడం కష్టం. ఇంతకుముందు వృద్ధులకు మాత్రమే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు యువతకు కూడా వస్తున్నట్లు కనిపిస్తోంది.
అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్ తోటకూర రికార్డు సృష్టించారు. ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ చేపట్టిన ‘న్యూ షెపర్డ్’ ప్రాజెక్టులో టూరిస్ట్‌గా వెళ్లారు. 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షయానం చేసిన విషయం తెలిసిందే. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజా చారి, శిరీష బండ్ల వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు.
కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో స్థానిక, విదేశీ విద్యార్థుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కిర్గిస్థాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం.. మే 13న కిర్గిజ్ విద్యార్థులు, ఈజిప్టు వైద్య విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.
భారతీయుల రాకతో టూరిజం పరంగా అభివృద్ధి చెందిన మాల్దీవులు ఇప్పుడు కుదేలు పడుతోంది. భారత టూరిస్టులు మాల్దీవులకు బదులుగా లక్షదీప్ కు వెళ్తుండటంతో మల్దీవులు పర్యాటకం దివాళా తీసింది.