West Bengal ElectIon Results: ప్రధాని మోడీ ‘‘ఝల్‌మురి’’ తిన్న చోట బీజేపీ ఆధిక్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అంతకంతకు ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతోంది. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మ్యాజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ ఏకంగా 150+ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ ‘‘ఝల్‌మురి’’ ఎఫెక్ట్ బాగానే పనిచేసింది. ప్రధాని మోడీ బెంగాల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఝార్‌గ్రామ్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో, నడిరోడ్డుపై సామాన్య వ్యక్తిలాగా నడుచుకుంటూ ఒక తినుబండారాల షాక్‌కు వెళ్లి ‘‘ఝల్‌మురి ’’ ఆర్డర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. షాప్ యజమానితో మాట్లాడుతూ ఝల్‌మురి టేస్ట్‌ను ఆస్వాదించారు. అయితే, ఇప్పుడు ఝార్‌గ్రామ్ సీటులో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
ఝల్‌మురికి సంబంధించిన వీడియోను ప్రధాని ఎక్స్‌లో షేర్ చేశారు. నాలుగు బహిరంగ సభలతో బిజీగా ఉన్నప్పటికి, రుచికరమైన ఝల్మురిని ఆస్వాదించానని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఝల్‌మురి కోల్‌కతాలోనే కాకుండా పశ్చిమ బెంగాల్ అంతటా ప్రసిద్ధి చెందిన ఒక వీధి ఆహారం. దీనిని మసాలాలు, మరమరాలు, ఉల్లిపాయలు, మిరపకాయలు, ఆవ నూనెల మిశ్రమంతో తయారు చేస్తారు. దీని కారమైన రుచిని స్థానికులు, సందర్శకులు ఇద్దరూ ఇష్టపడతారు.
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!