Anna Hazare: ‘‘ఆత్మపరిశీలన చేసుకోవాలి’’.. ఆప్‌పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు..
- ఆప్ ఆత్మపరిశీలన చేసుకోవాలి..
- పార్టీలో అంతా బాగుంటే వారు ఎందుకు వెళ్లేవారు..
- కేజ్రీవాల్ పార్టీ వ్యవహారాలపై అన్నాహజారే వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anna Hazare: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆప్‌కు భారీ షాక్ ఇచ్చారు. తనతో పాటు మొత్తం ఏడుగురు ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. 2/3 వంతు సభ్యులు బీజేపీలో చేరడంతో, రాజ్యసభలో ఆ పార్టీ మొత్తం బీజేపీలో విలీనమైనట్లే. ఇదిలా ఉంటే, ఈ పరిణామాల గురించి ప్రజా కార్యకర్త అన్నాహజారే స్పందించారు. ప్రజస్వామ్యంలో ప్రతీ వ్యక్తికి రాజకీయ నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. వరసగా నాయకులు ఎందుకు వెళ్లిపోతున్నారనే దానిపై ఆప్ ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పారు. పార్టీలో ఏదో ఇబ్బంది ఎదుర్కోవడం వల్లే వారు పార్టీని వీడినట్లు చెప్పారు. మహారాష్ట్ర అహిల్యానగర్ జిల్లాలో శుక్రవారం హజారే ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
‘‘ఇదంతా ఆప్ నాయకత్వం తప్పే, ఆ పార్టీ సరైన మార్గంలో నడిచి ఉంటే, వారు పార్టీని వీడేవారు కాదు’’ అని హజారే చెప్పారు. ఒకరు పార్టీని వీడాలనే నిర్ణయం వెనక కొన్ని అంతర్లీన కారణాలు ఉంటాయని, వీటిని విస్తృత ప్రజాస్వామ్య కోణంలో చూడాలని హజారే చెప్పారు. చద్దాతో సహా ఇతరులు పార్టీ వీడటానికి, ఏ పార్టీలో చేరాలనే దానిపై ప్రతీ వ్యక్తికి అభిప్రాయం ఉంటుందని ఆయన అన్నారు.
2011 నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నాహజారేతో పాటు అరవింద్ కేజ్రీవాల్ కీలకంగా పనిచేశారు. ఢిల్లీలో నిరసనలు, నిరాహార దీక్షల సమయంలో కేజ్రీవాల్, హజారే కలిసి పనిచేశారు. రాఘవ్ చద్దా, మరో ఆరుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన వెంటనే హజారే ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?