భారత సంతతి విద్యార్థిని కోనంకి సుదీక్ష చౌదరి (20) మిస్సింగ్ మిస్టరీగా మారింది. అమెరికాలోని వర్జీనియా నివాసి అయిన సుదీక్ష.. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహార యాత్రకు వెళ్లింది. మార్చి 6న బీచ్‌లో విహరిస్తుండగా ఆకస్మాత్తుగా మాయం అయింది.
భారత సంతతికి చెందిన విద్యార్థిని సుదీక్ష(20) డొమినికన్ రిపబ్లిక్‌లోని ఓ రిసార్ట్ బీచ్‌లో హఠాత్తుగా అదృశ్యమైంది. బికినీ ధరించి బీచ్‌లో నడుస్తుండగా కనిపించకుండా పోయింది. మార్చి 6న స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. సుదీక్ష తప్పిపోయిన విషయాన్ని స్నేహితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆమె కోసం అధికారులు గాలిస్తు్న్నారు.