Maldives: భారత్ మిలిటరీ మా దేశం నుంచి విత్‌డ్రా చేసుకోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవులు అన్నంత పనిచేసింది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత.. మాల్దీవుల్లో భారత మిలిటరీ ఉనికి ఉపసంహరించుకోవాలని కోరింది. అంతకుముందు రోజు ప్రయాణ స్వీకారానికి భారత్ తరుపున మాల్దీవులు వెళ్లిన కేంద్రమంత్రి కిరెన్ రిజిజును కలిసినప్పుడు, ముయిజ్జూ అధికారికంగా ఈ అభ్యర్థన చేసినట్లు తెలిసింది.
మాల్దీవుల నుంచి భారత్ మిలిటరీని వెళ్లగొడతామని, ఎన్నికల ముందు ముయిజ్జూ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రధాన హామీల్లో ఒకటైన దీన్ని వెంటనే అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రమాణస్వీకారానికి ముందు కొన్ని సందర్భాల్లో ఇదే విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు స్పష్టం చేశారు. అయితే భారత మిలిటరీ స్థానాన్ని, చైనా కానీ ఇతర దేశాల మిలిటరీలతో భర్తీ చేయమని హమీ ఇచ్చారు. తాము భారత్, చైనాతో పాటు అన్ని దేశాలతో సంబంధాలను కోరుకుంటున్నామని, మాది చిన్న దేశమని ఎవరితో విద్వేషం పెంచుకోమని ఓ ఇంటర్వ్యూలో ముయిజ్జూ చెప్పారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
Read Also: Asaduddin Owaisi: “రాహుల్ గాంధీ అద్దంలో చూసుకో”.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..
భారతదేశం పేరును ప్రస్తావించకుండా.. మాల్దీవుత్లో విదేశీ సైనిక సిబ్బంది ఉండదని, మా భద్రత విషయానికి వస్తే నేను రెడ్ లైన్ గీశాను, మాల్దీవులు కూడా ఇతర దేశాల పరిధిని గౌరవిస్తుందని చెప్పినట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
హిందూ మహాసముద్రంలో భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న మాల్దీవులు ఇండియాకు చాలా కీలకం. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా ఆధిక్యతను అడ్డుకోవాలంటే మాల్దీవులు చాలా అవసరం. అయితే గత మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలేహ్ భారత్‌కి సన్నిహితంగా ఉండే వారు. అయితే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు చైనాకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!