మాల్దీవులలో ఉన్న భారత సైనిక అధికారుల బృందం స్వదేశానికి తిరిగి వచ్చింది. అలాగే, అక్కడే ఉన్న హెలికాప్టర్‌ను ఆపరేట్ చేయడానికి భారతీయ పౌరుల బృందం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అయితే, మొదటి భారత సైనిక బృందం ఉపసంహరణకు సంబంధించి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఎలాంటి ధృవీకరణ చేయలేదు. అడ్డూ సిటీలో మోహరించిన భారత సైనికులు తిరిగి భారత్‌కు చేరుకున్నారని మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ (MNDF) మీడియా అధికారి అధాధూ న్యూస్ పోర్టల్‌కి తెలిపారు. ఇక, వారి స్థానంలోకి సమాన సంఖ్యలో భారతీయ పౌరులు పంపబడ్డారు. ఇక, భారత సైనికులు అక్కడ మోహరించిన హెలికాప్టర్ల మిషన్లను పూర్తి చేస్తారు.
Read Also: Mrunal Thakur: బంపర్ ఆఫర్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్.. పాన్ ఇండియా స్టార్‌కు జోడీగా!
అయితే, 26 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి బ్యాచ్ ఫిబ్రవరి 26న మాలేకు చేరుకుంది. ఇప్పుడు భారతీయ సైనిక అధికారులను భర్తీ చేస్తుంది.. అడ్డూలో హెలికాప్టర్లను నడుపుతుంది. భారతదేశం కూడా ఈ బృందంతో కొత్త హెలికాప్టర్‌ను పంపింది. సర్వీస్ చేయాల్సిన పాత హెలికాప్టర్‌ను రీకాల్ చేసింది. ఈ హెలికాప్టర్‌తో కూడిన భారత నౌక ఫిబ్రవరి 29న అడ్డూకు చేరుకుంది. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనాకు బలమైన మద్దతుదారు కావడంతో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. అతను భారతదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడు. అందుకే ఒక్క భారత సైనిక అధికారిని కూడా తమ దేశంలో ఉండనివ్వబోమని ముయిజ్జూ గతంలో వెల్లడించారు.
Read Also: SIPRI Report : ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు కొనుగోలు చేసే దేశంగా భారత్
ఇక, మే 10 తర్వాత భారత్ కు చెందిన ఆర్మీ సిబ్బంది సివిల్ దుస్తుల్లో కూడా మాల్దీవుల్లో ఉండేందుకు అనుమతించరు అని అధ్యక్షుడు ముయిజ్జూ తెలిపారు. గత ఏడాది అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరిని అవలంబించాడు. మాల్దీవుల నుంచి మొత్తం 90 మంది భారతీయ సైనికులను తిరిగి పంపుతానని చెప్పుకొచ్చాడు. ముయిజ్జూ ప్రభుత్వం మాలేలో అత్యాధునిక చైనీస్ పరిశోధన నౌకను ఏర్పాటు చేసింది.. దీంతో చైనా సైన్యంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎంఎన్‌డీఎఫ్ ఈ పని చేసింది. ఈ ఒప్పందం ప్రకారం చైనా మాల్దీవులకు నాన్-లెథల్ ఆయుధాలను ఉచితంగా అందిస్తుంది.