Indian Solder: టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారత్‌కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి. ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 20వేల మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఇంకా శిథిలాల కిందే చిక్కుకున్నారు. భూకంపం ధాటికి విలవిల్లాడుతున్న టర్కీ, సిరియా దేశాలకు ప్రపంచదేశాలు సాయం చేస్తున్నాయి. ఈ దీనస్థితిని గమనించిన భారత్.. ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట సహాయక చర్యలు అందిస్తోంది. ఇందులో భాగంగా మందులు, ఇతర వైద్య పరికరాలు, సిబ్బందిని అక్కడికి పంపింది. ఈ సందర్భంగా భారత సైన్యం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తోంది.
Read Also: ‘Writer Padmabhushan’: శివరాజ్ కుమార్ అభినందనలు అందుకున్న రైటర్!
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 70 దేశాల నుంచి రెస్క్యూ సిబ్బందితో పాటు ఇతర సామాగ్రి, ఆహారం, మందులను తరలించారు. భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ మూడు బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కోసం టర్కీకి చేరుకున్నాయి. దీనికితోడు భారత సైన్యానికి చెందిన వైద్య బృందం కూడా టర్కీకి చేరుకుంది. వీరు హటే పట్టణంలో ఫీల్డ్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. క్షతగాత్రులకు నిరంతరం వైద్య చికిత్స అందిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి. ఈ బృందాలు గురువారం ఆరేళ్ల బాలికను భవన శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశారు.
Read Also: Jagga Reddy: నా లైఫ్ ఇంకా ముత్యాల ముగ్గు హీరోయిన్ లాంటిదే..!
ఈ తరుణంలో ఇండియన్ ఆర్మీ మనసుల్ని హత్తుకునే ఫోటో ఒకటి షేర్ చేసింది. కృతజ్ఞతతో కూడిన టర్కిష్ మహిళ.. సహాయక చర్యల్లో ఉన్న భారత మహిళా సైనికురాలిని హత్తుకుని.. ముద్దు పెట్టింది. ఈ ఫొటో షేర్ చేసిన ఇండియన్ ఆర్మీ ‘వి కేర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆర్మీ చేస్తున్న కృషిని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
We Care.#IndianArmy#Türkiye pic.twitter.com/WoV3NhOYap
— ADG PI – INDIAN ARMY (@adgpi) February 9, 2023