Indian Solder: భారత సైనికులు ఎల్లప్పుడూ తమ ప్రజల బాగు కోసం పోరాడుతోనే ఉంటారు. ప్రస్తుతం జమ్ము కశ్మీర్ ను భారీ హిమపాతం ముంచెత్తుతోంది. ఈ క్షణంలో అక్కడ వారు బయటకు వెళ్లేందుకు కూడా జంకుతున్నారు.. ఇంత భారీ హిమపాతాన్ని తట్టుకుని ఆర్మీ.. భారత వైమానిక దళం గురువారం జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లోని ఒక కుగ్రామం నుండి ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణీని కాపాడాయి. తమకు వచ్చిన ప్రమాద కాల్ కు స్పందించాయి. ఆమెను కాపాడేందుకు ఆర్మీ దళాలు మారుమూల నవాపాచి ప్రాంతంలోని మహిళ వద్దకు చేరుకున్నాయి. ఆ హిమం గుండా మహిళను స్ట్రెచర్‌పై తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఉన్న మహిళను హెలీకాప్టర్లో కిష్త్వార్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు సోల్జర్స్.
Read Also: Lover Attack: ఆకతాయి దుశ్చర్య.. భర్తని వదిలెయ్ నాతో వచ్చెయ్.. కట్ చేస్తే..
‘భారత వైమానిక దళం సమన్వయంతో భారత సైన్యం కిష్త్వార్ జిల్లాలోని రిమోట్ వింటర్ ఐసోలేటెడ్ నవపాచి ప్రాంతం నుండి కిష్త్వార్ పట్టణానికి ఒక గర్భిణిని తరలించింది.. అక్కడ మహిళ జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతోంది’. అని డిఫెన్స్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. నవపాచి ప్రజలు సైన్యం, IAFకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Ravi Ashwin: కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్..ఖాతాలో అరుదైన మైలురాయి
కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతంలో.. ముఖ్యంగా శీతాకాలంలో రోడ్లు మూసుకుపోవడం వల్ల జిల్లాలోని మిగిలిన ప్రాంతాల నుండి సంబంధాలు తెగిపోయినప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడానికి సైన్యం ప్రయత్నిస్తోంది లెఫ్టినెంట్ కల్నల్ ఆనంద్ చెప్పారు. భారత సైన్యం ఎల్లప్పుడూ ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించడమే కాకుండా ప్రజలకు ప్రాణాలను రక్షించే మానవతా సహాయాన్ని అందిస్తుందని ఆయన అన్నారు.