Indian Armed Forces : అన్ని వైపుల నుండి దేశ భద్రతను పటిష్టం చేయడానికి భారత సైన్యం ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఏర్పాటుకు వేగంగా పావులు కదుపుతోంది. ఈ మేరకు రక్షణ శాఖ వర్గాలు సమాచారం అందించాయి.
Manipur Violence: మణిపూర్లో శాంతి నెలకొల్పేందుకు సైన్యం 'ఆపరేషన్ వెపన్ రికవరీ'ని నడుపుతోంది. రాజధాని ఇంఫాల్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవుల్లో సైన్యం ఆపరేషన్లు నిర్వహిస్తోంది. రాత్రి చీకటిలో, సైన్యం న్యూ కీథెల్‌మన్‌బీ గ్రామాన్ని ముట్టడించింది.
Manipur: మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఈసారి రాజధాని ఇంఫాల్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆర్మీ, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి.
Manipur Violence: గిరిజన, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకోవడంతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. గత నాలుగు రోజులుగా అక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. స్కూళ్లు, వాహనాలు, చర్చిలకు ఆందోళనకారులు నిప్పుపెడుతున్నారు. సైన్యం, పారామిలిటీ బలగాలను రాష్ట్రంలో మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సైన్యం ప్రకటించింది. పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. సైన్యం, అస్సాం రైఫిల్స్ నుంచి 10,000 మంది సైనికులు మోహరించారు.
Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ వరస ఎన్‌కౌంటర్లతో అట్టుడుకుతోంది. బుధవారం నుంచి కాశ్మీర్ ప్రాంతంలో ఏదో చోట ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంటుంది. శనివారం బారాముల్లా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభం అయింది. మరోవైపు రాజౌరీలో శుక్రవారం నుంచి ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉంది. రాజౌరీ ఎన్‌కౌంటర్ ఇప్పటికే 9 పారా కమాండో దళానికి చెందిన నలుగురు జవాన్లు, సైన్యానికి చెందిన ఒకరు మొత్తం ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.
Rajouri terror attack: జమ్మూ కాశ్మీర్ లో ఏడు నుంచి తొమ్మిది మంది ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతాబలగాలు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టాయి. హెలికాప్టర్లు, డ్రోన్లతో సరిహద్దుల్లోని అడవులను స్కాన్ చేస్తున్నాయి. శుక్రవారం జరిగిన రాజౌరీ ఎన్ కౌంటర్ లో ఐదుగురు జవాన్లు మరణించడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు సైన్యం ఉగ్రవాదుల కోసం వెతుకుతోంది. ఇప్పటికే రాజౌరీతో పాటు బారాముల్లాలో ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో వరస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. శుక్రవారం రాజౌరిలో ప్రారంభమైన ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా.. శనివారం బారాముల్లాలోని కర్హమా కుంజర్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ ప్రారంభం అయినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. బారాముల్లా ఎన్‌కౌంటర్ లో ఒక ఉగ్రవాదిని భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. శనివారం తెల్లవారుజామున 1.15 గంటలకు ఉగ్రవాదలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఇరు పక్షాల మధ్య కాల్పులు ప్రారంభమైనట్లు రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నాయి భద్రతా బలగాలు. వరసగా మూడో రోజు కాశ్మీర్లో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. రాజౌరీ జిల్లాలో శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు అందిన సమచారం ప్రకారం భద్రతా సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది.
Manipur Violence: మణిపూర్ లో గిరిజన, గిరిజనేతరుల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సైన్యం మోహరించింది. మోరే, కాంగ్పోక్పి ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని భారత సైన్యం వెల్లడించింది. ఇంఫాల్, చురచంద్‌పూర్ ప్రాంతంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరగుతున్నాయని తెలిపింది. సైన్యంతో పాటు పారామిలిటీరీ ట్రూప్స్ రాష్ట్రంలో మోహరించారు. అస్సాం నుంచి మరిన్ని బలగాలను భారతవాయుసేన కల్లోలిత మణిపూర్ రాష్ట్రానికి చేర్చుతోంది.
Chopper Crash: జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కిష్త్వార్ జిల్లాలోని మార్వా తహసీల్‌లోని మచ్చ్నా గ్రామ సమీపంలో గురువారం ఆర్మీ ఛాపర్ కూలిపోయింది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్ లో ముగ్గురు ఉన్నారు. పైలట్, కో పైలట్ గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. హిల్ మార్వా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆర్మీ అధికారుల తెలియజేసిన వివరాలు ప్రకారం హెలికాప్టర్ లో ఉన్న వారంతా సురక్షితంగా ఉన్నారు.