Jammu Kashmir Encounter: జమ్మూకాశ్మీర్‌లో గత 24 గంటలుగా ఎన్‌కౌంటర్ జరుగుతోంది. రాజౌరి ప్రాంతంలో కలకోట్ అటవీ ప్రాంతంలో జరగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఇప్పటికే నలుగురు ఆర్మీ జవాన్లు మరణించాగా.. గాయపడిన మరో సైనికుడు ఈ రోజు మరణించాడు. ఇదిలా ఉంటే పాకిస్తాన్‌కి చెందిన కీలక లష్కరే తోయిబా ఉగ్రవాది భద్రతాబలగాలు హతమార్చాయి. మరణించిన పాక్ ఉగ్రవాదిని ఖారీగా గుర్తించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచేందుకు ఇతను ప్రయత్నిస్తున్నాడు.
Jammu Encounter: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో గురువారం ఉదయం ధర్మసల్ బెల్ట్‌లోని బజిమల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, సైన్యం మధ్య మరోసారి ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఈరోజు ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గత సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ సారి కూడా దీపావళి వేడుకలను భారత సైన్యంతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘మన సైన్యం దేశ సరిహద్దుల్లో హిమాలయాల మాదిరి దృఢంగా నిలబడినంత కాలం భారత్ సురక్షితంగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
Jammu and Kashmir: బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో టిఆర్‌ఎఫ్ ఉగ్రవాది హతమయ్యాడు అని అధికారులు వెల్లడించారు. వివరాలలోకి వెళ్తే.. విచక్షణారహితంగా దాడులు చేస్తూ దేశంలో శాంతి భద్రతలను ఆటంక పరిచే ఉగ్రవాదుల పైన ఇండియన్ ఆర్మీ ద్రుష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను ఏరిపారేసేందకు కశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ కలిసి సంయుక్తంగా బుధవారం ఎన్‌కౌంటర్ ని ప్రారంభించారు. ఈ ఆపరేషన్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు తెలిపారు. కాగా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాదికి..…
Women Soldiers: మహిళా సైనికులకు కేంద్ర గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళా సైనికులకు, నావికులకు, వైమానిక దళాల్లో పనిచేసే మహిళలకు వారి అధికారులతో సమానంగా ప్రసూతి, శిశు సంరక్షణ, పిల్లల దత్తత సెలవులకు కేంద్రం ఓకే చెప్పింది. సెలవులు మంజూరు చేసే ప్రతిపాదనకరు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ర్యాంకులో సంబంధం లేకుండా సాయుధ దళాల్లోని మహిళలందరిని సమానంగా చూడాలనే దానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు భారీ విజయం దక్కింది. పాకిస్తాన్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. గురువారం రోజున ఉగ్రవాదలు కుప్వారా సెక్టార్ లో నియంత్రణ రేఖ వెంబడి చొరబడేందుకు విఫలయత్నం చేశారు. హతమైన ఐదుగురు ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించారు.
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మచ్చిల్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి ఈరోజు భారత ఆర్మీ దళాలు చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేయడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Jammu Kashmir: ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్నట్లుగా పాక్ కి ఎంత చెప్పిన తన వికృత చేష్టలు మాత్రం మానదు. తాజాగా మరోసారి భారత భూభాగం లోకి ప్రవేశించాలని చూసారు పాక్ ఉగ్రవాదులు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు మన సైనికులు. వివరాలలోకి వెళ్తే.. ఉత్తర కశ్మీర్ బారాముల్లా జిల్లా లోని ఉరి సెక్టార్లో ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించిందేకు ప్రయత్నించారు. కాగా ఉగ్రవాదుల ప్రయత్నాలను భారత…
Breaking news: దేశం రక్షణలో ప్రాణాలను సైతం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంటారు ఆర్మీ సైనికులు. ప్రతి క్షణం వాళ్ళకి కత్తి మీద సాములాంటిదే. ఏమాత్రం ఆదమరిచి ఉన్న అపాయం ముంచుకు వస్తుంది. ఈ మాట ఇప్పుడు చెప్పడానికి కారణం..శనివారం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో భారత సైన్యానికి చెందిన చేతక్ హెలికాప్టర్ ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాలలోకి వెళ్తే శనివారం ఒక సాధారణ శిక్షణా మిషన్‌లో పాల్గొన్న చేతక్ హెలికాప్టర్ ని అత్య అవసరంగా ల్యాండ్…
Sikkim Flood: ప్రస్తుతం సిక్కిం అతలాకుతలం అయిపోతుంది. మంగళవారం అర్థరాత్రి ఇక్కడి లొనాక్ సరస్సుపై అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకోవడంతో తీస్తా నదిలో భారీ వరద వచ్చింది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు.