Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ 48 గంటలుగా కొనసాగుతోంది. కోకెర్‌నాగ్ ప్రాంతంలో బుధవారం ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికే ముగ్గురు అధికారులు మరణించారు. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోన్‌చక్‌తో పాటు జమ్మూ పోలీస్ డీఎస్పీ హిమాయున్ భట్ వీర మరణం పొందారు.
Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా కోకెర్ నాగ్‌లో తీవ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు అధికారులు వీరమరణం పొందారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ అక్కడికక్కడే మరణించగా..
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని కోకెర్ నాగ్ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఆర్మీ అధికారుల, ఒక డీఎస్పీ మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనాక్, డీఎస్పీ హుమాయున్ భట్‌లుగా గుర్తించారు.
Unrest in Manipur: గత కొన్ని నెలలుగా జాతి వివాదంతో పోరాడుతున్న మణిపూర్‌లో తీవ్రవాద సంస్థల క్రియాశీలత ఇప్పుడు ఆందోళనను పెంచింది. గత వారం గిరిజనులపై దాడికి ప్రయత్నించిన గుంపును అడ్డుకునేందుకు సైన్యం, అస్సాం రైఫిల్స్ జోక్యం చేసుకోవడంతో భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ రామన్ త్యాగిపై కాల్పులు జరిగాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లా చసానా సమీపంలో సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యం మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతంకాగా.. ఓ జవాన్ గాయపడ్డాడు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌ని సందర్శించి 1999లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ప్రాణాలు అర్పించిన భారత సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ ఒక ప్రదేశం మాత్రమే కాదన్న రాహుల్‌గాంధీ.. ఇది పరాక్రమమని అభివర్ణించారు.
లడఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం లడఖ్‌లోని లేహ్ జిల్లాలో వారి వాహనం రోడ్డుపై నుంచి లోతైన లోయలో పడిపోవడంతో తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
Kulgam Encounter: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. రాత్రి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉగ్రవాదులు తప్పించుకోగలిగారు.
పరువు నష్టం కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2001లో డిఫెన్స్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. 2002లో మేజర్ జనరల్ ఎంఎస్ అహ్లూవాలియా పరువు నష్టం కేసు వేశారు.
ఆర్మీలో 6,800కు పైగా ఖాళీలతో కూడిన మేజర్, కెప్టెన్ స్థాయిలలో అధికారుల కొరత ఉందని, అయితే ప్రస్తుత కార్యాచరణ అవసరాలను తీర్చడానికి అందుబాటులో ఉన్న బలం సరిపోతుందని కేంద్రం శుక్రవారం పార్లమెంటుకు తెలియజేసింది.