Indian Air Force’s Surya Kiran Team To Put On Air Show Ahead Of IND vs AUS World Cup Final: నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం అయ్యే ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ వీక్షించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్…
మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితిని అంచనా వేయాలని, భారత వైమానిక రక్షణ వ్యవస్థల పటిష్టతపై వైమానిక దళం దృష్టి పెట్టాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం టాప్ కమాండర్లను కోరారు.
భారత వైమానిక దళం 91వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు (ఆదివారం) జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా వైమానిక దళ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. వారి గొప్ప సేవ, త్యాగం మన గగనతల భద్రతకు భరోసానిస్తుందని అన్నారు. భారత వైమానిక దళం యొక్క ధైర్యసాహసాలు, నిబద్ధత, అంకితభావానికి భారతదేశం గర్విస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
తూర్పు లడఖ్‌లోని సరిహద్దు రేఖ వద్ద చైనాతో సైనిక ప్రతిష్టంభన ముగిసి, చైనా దళాలు వెనక్కి తగ్గే వరకు భారత వైమానిక దళం వెనక్కి తగ్గదని భారత ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. భారత వైమానిక దళం కార్యాచరణ సన్నాహాలు పూర్తిగా వ్యూహాత్మకంగా మాత్రమే కాకుండా డైనమిక్‌గా కూడా ఉన్నాయని అన్నారు.
Indian Air Force: చైనాతో కొనసాగుతున్న సరిహద్దు వివాదం కొనసాగుతోంది. దీంతో సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో లడఖ్‌లోని న్యోమాలో భారత్ ఎయిర్‌ఫీల్డ్‌ను నిర్మించింది.
India-USA: భారత్-అమెరికాల మధ్య బంధం మరింత బలపడింది. చారిత్రక రక్షణ సహకార ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ ఒకే చెప్పింది. దీంతో భారత వైమానికి దళం కోసం సంయుక్తంగా జెట్ ఇంజిన్లను తయారు చేసే ఒప్పందానికి మార్గం సుగమం అయింది
Heart Transplant: కేవలం 31 ఏళ్లకే ప్రపంచానికి వీడ్కోలు పలుకుతూ ఓ మహిళ దేశాన్ని కాపాడుతున్న జవాన్ ప్రాణాలు నిలబెట్టింది. నాగ్‌పూర్‌లో మహిళ బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించిన తర్వాత, ఆమె గుండెను భారత వైమానిక దళ సైనికుడికి అమర్చారు.
MiG-21: ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) మిగ్-21 జెట్ ఫ్లీట్ ను నిలిపివేశాయి. మే 8న రాజస్థాన్ హనుమాన్ గఢ్ గ్రామంలో మిగ్ -21 బైసన్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సూరత్‌గఢ్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన మిగ్-21 సాంకేతిక కారణాలతో కూలిపోయింది.
రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన భారత వైమానిక దళానికి చెందిన తొలి మహిళా పైలట్ శివాంగి సింగ్ ఫ్రాన్స్‌లోని బహుళజాతి విన్యాసాల్లో పాల్గొంటారు. IAF బృందంలో మహిళా పైలట్ శివాంగి సింగ్ చోటు దక్కింది. ఆమె రాఫెల్ స్క్వాడ్రన్ కు చెందిన మొదటి మహిళా ఫైటర్ పైలట్.
వింగ్ కమాండర్ దీపికా మిశ్రాకు భారత వైమానిక దళం (IAF) చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి గురువారం వాయు సేన పతకాన్ని అందించారు. ఆమె శౌర్య పురస్కారం అందుకున్న మొదటి మహిళా ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా నిలిచారు.