Indian Army sings MoU with 11 banks for Agniveer salary package: భారత సైన్యం కొత్తగా తీసుకువచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నివీర్’. ఈ పథకం కోసం ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే వీరికి సంబంధించిన సాలరీ ప్యాకేజీ కోసం 11 బ్యాంకులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఇండియన్ ఆర్మీ. అగ్నివీరులకు బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్,
Air Chief Marshal Vivek Ram Chaudhari: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శనివారం 90వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. చండీగఢ్ లో దీనికి సంబంధించిన వేడుకలు జరిగాయి. గంట పాటు 80 విమానాలతో సుఖ్నా సరస్సుపై వైమానికి విన్యాసాలు జరిగాయి. ఈ కార్యక్రమాన్నికి ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఎఎఫ్ ను ఉద్దేశిస్తూ కీలక ప్రసంగం చేశారు. చారిత్రాత్మక ‘వెపన్ సిస్టమ్ బ్రాంచ్’ను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం…
అర్జెంటీనా వైమానిక దళం కోసం భారత్లో తయారైన తేజస్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్పై అర్జెంటీనా ఆసక్తిని భారతదేశం శుక్రవారం అంగీకరించింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అర్జెంటీనాలో రెండు రోజుల అధికారిక పర్యటన సందర్భంగా తేజస్పై చర్చలు జరిగాయి.
మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు 60 ఏళ్లుగా కూలిపోతూనే ఉన్నాయి.. వాయుసేనలోకి ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 400 ప్రమాదాలు జరిగాయంటే.. వాటి పనితనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారత వాయుసేనకు చెందిన ఇద్దరు పైలట్లను మిగ్-21 బలి తీసుకుంది. ఈ పాత కాలపు జెట్ల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని, వీటిని విరమించుకోవాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, తాజా దుర్ఘటనపై భాజపా ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఎగిరే శవ పేటికలను ఇంకెప్పుడు భారత వైమానిక దళం నుంచి తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్లోని బర్మర్ జిల్లాలో ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. కూలిన మిగ్-21 విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు భారత వైమానిక దళం వెల్లడించింది.
అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) అగ్నివీరుల ఎగ్జామ్ ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రారంభం అయింది. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ1, బీ1, సీ1 షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టు పరీక్ష ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కాగా.. రెండో షిఫ్టు 11.30 గంటలకు మూడో షిఫ్టు మధ్యాహ్నం 3.15 గంటలకు నిర్వహించనున్నారు. జూలై 24 నుంచి జూలై 31 వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పరీక్షలను నిర్వహించనున్నారు.