Indian Air Force’s Surya Kiran Team To Put On Air Show Ahead Of IND vs AUS World Cup Final: నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం అయ్యే ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ వీక్షించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సహా పలువురు ప్రముఖులు నరేంద్ర మోడీ స్టేడియంకు రానున్నారని తెలుస్తోంది. అంతేకాదు సినిమా సెలెబ్రిటీలు కూడా భారీ సంఖ్యలో హాజరవుతారట. ఈ నేపథ్యంలో- నరేంద్ర మోదీ స్టేడియం వద్ద గుజరాత్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది.
Also Read: IND vs AUS World Cup Final 2023: సూర్యకుమార్ ఔట్.. ఫైనల్‌లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!
భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ముందు భారత వాయు సేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు చేయబోతోంది. మ్యాచ్ ఆరంభమయ్యే 10 నిమిషాల ముందు నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రత్యేక ఎయిర్ షో జరగనుంది. దీనికోసం ఇప్పటికే రిహార్సల్స్ కూడా మొదలయ్యాయి. ఈ విన్యాసాలు క్రికెట్ అభిమానులను అలరించనున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. సూర్యకిరణ్ తొమ్మిది ఎయిర్‌క్రాఫ్ట్‌ల సమ్మేళనం అన్న విషయం తెలిసిందే. గతంలోనూ వివిధ సందర్భాల్లో సూర్యకిరణ్ విన్యాసాలు ప్రదర్శించింది.
Air show preparation at Narendra Modi Stadium ahead of the World Cup final. 🇮🇳 🏆pic.twitter.com/5vTHkDS580
— Johns. (@CricCrazyJohns) November 17, 2023
Indian Air Force will perform an air show ahead of the World Cup final 2023. [PTI] pic.twitter.com/8Tv7BK809b
— Johns. (@CricCrazyJohns) November 16, 2023