Sania Mirza going to be India’s first Muslim fighter pilot: ఉత్తర ప్రదేశ్ కు చెందిన యువతి సానియా మీర్జా భారతదేశపు తొలి ముస్లిం ఫైటర్ పైలట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే దేశంలో తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్ కానున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మామూలు టీవీ మెకానిక్ కుమార్తె అయిన సానియా మీర్జా ఎన్డీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి వార్తల్లో నిలిచారు. సానియా ఎన్డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ) పరీక్షల్లో 149వ ర్యాంకు సాధించారు. ఆమె ఎన్డీఏలో ఫైటర్ పైలట్ స్ట్రీమ్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: Jackpot : జగిత్యాల యువకుడికి 30 కోట్ల జాక్‌పాట్..
అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ గా మారాడానికి ఒక్కో అభ్యర్థికి నాలుగేళ్ల సమయం పడుతుంది. దీని కోసం సానియా మీర్జా చాలా కోర్సులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫైటర్ పైలట్ గా మారడానికి ప్లయింగ్ బ్రాంచ్ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుందని ఐఏఎఫ్ తెలిపింది. ఎయిర్ ఫోర్స్ క్యాడెట్ గా ఎన్డీఏలో చేరే ఏ అభ్యర్థి అయినా తన కోర్స్ మేట్స్ తో కలిసి 3 సంవత్సరాల కంబైన్డ్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే భారతదేశ తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్ అని పేరుతెచ్చుకునేందకు సానియా మీర్జాకు నాలుగేళ్ల సమయం పడుతుంది.
ఫైటర్ పైలర్ కావాలనుకుంటున్న సానిమా మీర్జాకు ఐఏఎఫ్ శుభాకాంక్షలు తెలియజేసింది. ఎన్డీయే పరీక్షలో సానియా 149వ ర్యాంక్ సాధించింది. హిందీ మీడియం విద్యార్థులు కూడా ధృడ సంకల్పం ఉంటే విజయం సాధించవచ్చని ఆమె తెలిపింది. సానిమా యూపీలోని మీర్జాపూర్ దేహత్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జసోవర్ గ్రామ నివాసి. యూట్యూబ్ లో మొదటి మహిళా పైలట్ అయిన అవనీ చతుర్వేదిని చూసి ప్రేరణ పొందినట్లు తెలిపారు.