మనదేశంలో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ కి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్నది. అయితే, 60 నుంచి 70 శాతం ఈ వ్యాక్సిన్ ను రష్యా నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నది. ఇండియాలో జూన్ నుంచి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈ వ్యాక్సిన్ పై ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. అయితే, ఈ వ్యాక్సిన్ కు అనుమతులు మంజూరు కావడంతో దీని ధర…
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉదృతంగా ఉండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే అర్హులైన అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇప్పటికే దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద సంఖ్యలో దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నది. దాదాపుగా ఇప్పటి వరకు దేశంలో 12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. ఎంత పెద్ద ఎత్తున వ్యాక్సిన్ లను అందిస్తున్నారో అదే లెవల్లో వ్యాక్సిన్ వృధా అవుతున్నది. దీనిపై కేంద్రం దృష్టి సారించింది. వ్యాక్సిన్ వృధాపై ప్రధాని మోడీ అసంతృప్తి…
దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ రెండున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 2,59,170 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,53,21,089కి చేరింది. ఇందులో 1,31,08,582 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 20,31,977 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,54,761 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. …
మే 1 వ తేదీ నుంచి దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు కాబోతున్నది. మూడో విడత వ్యాక్సినేషన్ కు సంబంధించిన ప్రకటనను నిన్నటి రోజున కేంద్రం రిలీజ్ చేసింది. 18 ఏళ్ళు పైబడిన వ్యక్తులు అందరికి వ్యాక్సిన్ వేసుకునే వెసులుబాటును కల్పించింది. ప్రస్తుతం 45 ఏళ్ళు పైబడిన వారికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. రెండో విడత వ్యాక్సినేషన్ లో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నామమాత్రపు ధరలతో…
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి భయానకంగా మారింది. రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా ఇంకా భయం వెంటాడుతూనే ఉన్నది. పైగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ కొరత ఇబ్బందులు పెడుతున్నది. పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ అందించాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తగినన్ని వ్యాక్సిన్ సరఫరా కాకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ నిర్వహించినా వ్యాక్సిన్ లేమి కారణంగా అరకొరగా మాత్రమే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. వ్యాక్సిన్ కొరతకు…
ప్రజలు సామాజికంగా, ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ విధించారు. మరికొన్ని రాష్ట్రాలు ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. ఇక ఇండియాలో రోజువారీ కేసులు రెండు లక్షలకు పైగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొదటి 25 లక్షల కేసులు నమోదవ్వడానికి 198 రోజుల సమయం పడితే, చివరి 25 లక్షల కేసులు కేవలం 15 రోజుల వ్యవధిలోనే నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి…
దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇండియాలో కొనసాగుతోంది. అయితే, వ్యాక్సిన్ కోసం అనేకమంది భారతీయులు నేపాల్ బాటపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు, అనేకమంది భారతీయులు చైనాతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. చైనాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అలానే చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాలలో చదువుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు . ఎవరైనా సరే చైనాలో అడుగుపెట్టాలి అంటే చైనా వ్యాక్సిన్…
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,34,692 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. ఇందులో 1,26,71,220 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 16,79,740 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1341 మంది మృతి చెందారు. …
దేశంలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. మొదటి వేవ్ లో పెద్ద వయసుకలిగిన వ్యక్తులకు కరోనా సోకగా, సెకండ్ వేవ్ లో ఎక్కువమంది యువత కరోనా బారిన పడుతున్నారు. పార్టీలు, ఫంక్షన్లు, వేడుకలు, పబ్లిక్ ప్లేస్ లు కరోనా హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. ఎక్కువ మంది ఒక చోట గుమికూడి ఉండొద్దని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో కంటే కరోనా నగరాల్లో అధికంగా విస్తరిస్తోంది. 2టైర్, 3 టైర్ నగరాల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన…
చూస్తుండగానే కోవిడ్ 19 సెకండ్ వేవ్ అదుపు తప్పిపోవడం ఆందోళనకరంగా మారింది, రోజుకు రెండు లక్షల కేసులకు మించి నమోదవడం మొదటి దఫా పరిస్తితిని మించిపోయింది.కేసులు ఎక్కువగా వున్నా మరణాలు ఆ స్తాయిలో లేవని మొదట అనుకున్నారు గాని ఆ సంతోషం కూడా ఆవిరైపోయింది. మొదటి దఫాలో మరణాల రేటు 1.1 శాతం లోపే ఉండగా ఇప్పుడు 1.3 శాతం దాటిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. పైగా పెరుగుదల వేగం కూడా గతం కంటే చాలా ఎక్కువగా వుంది.గతంలో…