భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. ఇతర దేశాలు భారత్ పేరు చెబితేనే వణికిపోతున్నాయి.. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. విదేశాల్లో ఉన్న తమ పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఆ దేశం.. భారత్‌లో ఉన్నవాళ్లపై ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడంపై నిషేధం విధించింది. ఇది ఎవరైనా అతిక్రమిస్తే.. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆసీస్ అత్యవసరంగా తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం.. తమ పౌరులు…
ఇది కరోనా కాలం.. ప్రస్తుతం సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే, తమకు అందుబాటులో ఉన్నపీహెచ్సీ ఏది..? ఎక్కడ టెస్టులు చేయించుకోవాలి..? మరెక్కడ వ్యాక్సిన్ దొరుకుతుంది అనేది.. తెలిసినవారిని అడిగి వాకాబు చేయాల్సిన పరిస్థితి.. అయితే, ఈ కష్టాలకు చెక్.. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ .. అందులో ఫేస్బుక్ యాప్ ఉంటే చాలు.. ఎందుకంటే.. ఫేస్బుక్ కొత్త టూల్‌ను తీసుకొస్తోంది. వ్యాక్సిన్ ఫైండర్ టూల్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మొబైల్ యాప్‌లో ఈ…
ఈ-కామర్స్ సంస్థలు అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి ప్రత్యేక ఆఫర్లు తెస్తూనే ఉంటాయి.. పండగల సీజన్ వచ్చినా.. ఇంకా ఏదైనా ప్రత్యేకమైన రోజు వస్తున్నా.. ముందే ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారు.. తాజాగా.. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రారంభిస్తోంది.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మే 2 నుంచి మే 7వ తేదీ వరకు కొనసాగనుంది ఈ ప్రత్యేక సేల్.. ఇక, ప్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అయితే, ఒకరోజు…
కరోనా మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు బ్రేక్ పడింది.. అయితే, అవసరాలను అనుగుణంగా కొన్ని ప్రత్యేక విమానాలు, కార్గో విమానాలను నడుపుతూ వచ్చినా.. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతూనే ఉంది.. ఇక, ప్రస్తుతం సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోన్న తరుణంలో.. విమానాలపై నిషేధాన్ని మే 31 వరకు పొడిగించింది కేంద్రం. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధానికి సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటును మే 31వ తేదీ అర్థరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్…
అమెరికాలో జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వందరోజులు పూర్తయింది. ఈ సందర్భంగా అయన స్టేట్ ఆఫ్ ది యూనియన్ అనే కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ తో ఈ వందరోజుల్లో ఎలాంటి బంధం బలపడిందో వివరించారు. వంద రోజుల్లో భారత్ తో బలమైన బంధం ఏర్పడిందని, ఇటీవలే ప్రధాని మోడీతో తాను మాట్లాడానని తెలిపారు. అమెరికా సెక్రటరీ అఫ్ స్టేట్, భారత విదేశాంగశాఖ మంత్రి అనేకమార్లు చర్చలు జరిపారని, రెండు దేశాల మధ్య బంధానికి…
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజు ఉగ్రరూపం దాల్చుతున్నది. గత తొమ్మిది రోజులుగా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న కూడా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం దేశంలో 3.86 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3500 లకు పైగా మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెప్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు 60వేలు దాటిపోతున్నాయి. మహారాష్ట్రతో పాటుగా కేరళ, కర్ణాటక, ఉత్తర…
కరోనాకు చెక్ పెట్టడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పుడు భారత్‌లో 45 ఏళ్లు పైబడినవారికి వేగంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.. ఇక, మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇస్తారు.. అయితే, ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్‌లోనే వేగంగా వ్యాక్సిన్ ప్రక్రియ సాగుతోందని కేంద్రం ప్రకటించింది.. కేవలం 95 రోజుల్లోనే 13 కోట్ల మందికి కోవిడ్ టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.. వేగంగా కరోనా టీకాలు ఇచ్చిన దేశం మనదేనని.. అదే…
దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నది. రోజువారీ కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 2,95,041 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,56,16,130కి చేరింది. ఇందులో 1,32,76,039 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 21,57,538 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,67,457 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో రికార్డ్ స్థాయిలో 2023 మంది…