దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్నటి కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో 40వేల దిగువకు కరోనా కేసులు చేరగా, ఈరోజు రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం కేసులు పెరిగాయి. ఇండియాలో కొత్తగా 45,951 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,03,62,848 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,94,27,330 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,37,064 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 817 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,98,454కి చేరింది. గడిచిన 24 గంటల్లో 60,729 మంది డిశ్చార్జ్ అయినట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. దేశంలో 33,28,54,527 మందికి వ్యాక్సిన్‌ను అందించారు.