భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా కిందికి దిగివస్తోంది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 43,071 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 955 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 52,299 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,45,433కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 2,96,58,078కి పెరిగాయి… ఇక, కరోనాతో మృతిచెందనవారి సంఖ్య 4,02,005గా ఉండగా… ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,85,350గా చెబుతోంది ప్రభుత్వం. మరోవైపు.. ఇప్పటి వరకు 35,12,21,306 మందికి వ్యాక్సినేషన్ జరిగిందని బులెటిన్‌లో పేర్కొంది.