భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గినట్టే కనిపించినా.. మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. అయితే, తాజా బులెటిన్ ప్రకారం.. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 29,689 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 415 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 42,363 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.14 కోట్లకు పెరిగింది.. ఇందులో 3,06,21,469 మంది బాధితులు ఇప్పటి వరకు కోలుకున్నారు.. మరోవైపు మహమ్మారి బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,21,382కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,98,100 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 44,19,12,395 డోసుల వ్యాక్సిన్ వేసినట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.