ప్రతినెలా 1 వ తేదీన చమురు, గ్యాస్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. ఇందులో భాగంగానే ఈరోజు కంపెనీలు గ్యాస్ ధరలను సవరించాయి. ఈ సవరణల ప్రకారం 19 కేజీల వాణిజ్యగ్యాస్ ధర రూ. 73.5 పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం దేశంలో వాణిజ్యగ్యాస్ సిలీండర్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో రూ.1623, ముంబైలో రూ.1579.50, కోల్‌కతాలో రూ.1629, చెన్నైలో రూ.1761గా ఉన్నది. వాణిజ్యగ్యాస్ సిలీండర్ ధరలను పెంచినప్పటికీ, గృహవినియోగానికి వినియోగించే 14.2 కిలోల గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం ఊరటనిచ్చే అంశం. జులై నెలలో ఉన్న ధరలే ఆగస్టులో కూడా కంటిన్యూకానున్నాయి.
Read: ఎవరూ సురక్షితం కాదు… ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు…