ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు సరికొత్త బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇండియా భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా కొనసాగుతోంది. సభ్యదేశంగా కొనసాగుతున్న ఇండియాలకు ఇప్పుడు ఆ మండలి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ పదవిలో భారత్ నెలరోజులపాటు కొనసాగుతుంది. ఇంతకు ముందు ఫ్రాన్స్ ఆ హోదాలో కొనసాగింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిది టిఎస్ తిరుమూర్తి బాధ్యతలు చేపట్టారు. భారత్‌కు ఈ పదవి వచ్చేందుకు ఫ్రాన్స్ సహకరించింది. ఈ ఆగస్టు నెలలోనూ అదే విధంగా తాత్కాలిక సభ్యదేశంగా తప్పుకునే చివరి నెలైన 2022 డిసెంబర్‌లోనూ ఇండియాకు ఈ అవకాశం ఉంటుంది. అధ్యక్ష పదవిని చేపట్టిన ఇండియా శాంతి స్థాపన, ఉగ్రవాదంపై పోరు, సముద్రతీర భద్రత తదితర అంశాలపై దృష్టిసారిస్తున్నట్టు అధ్యక్షుడు టీఎస్ తిరుమూర్తి పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ ఎప్పుడూ ముందు వరసలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Read: మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు…గృహ వినియోగదారులకు ఊరట…