ఇండియా లో “కరోనా” వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. దేశంలో గడచిన 24 గంటలలో 36,401 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు కాగా…530 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 39,157 కాగా…దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 3.23 కోట్ల కు చేరింది. ఇటు దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 3,64,129 కు చేరగా…దేశ వ్యాప్తంగా “కరోనా” పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 3,15,25,080 కు చేరింది.. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 4,33,049 కు చేరింది. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 18,73,757 “కరోనా” వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు.