కరోనా టీకా పంపిణీలో భారత్ దూసుకుపోతుంది. మిగతా దేశాల కంటే స్పీడ్‌గా టీకా పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 50 కోట్ల డోసులను అందించినట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇంతే వేగంగా కొనసాగాలని చెప్పారు. ఇది అనేక మందికి ప్రేరణ అని అన్నారు. అటు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా స్పందించారు. ఆరోగ్య శాఖ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. జనవరి 16న దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మొదట…
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తరంగా సాగుతున్న తొలి టెస్టుకి వరుణుడు విలన్‌గా మారేలా కనిపిస్తున్నాడు. కీలక సమయంలో జోరున కురుస్తోన్న వర్షం.. ఆటను రద్దయ్యేలా చేస్తోంది. రెండో రోజు, మూడు రోజు దాదాపు సగం ఆట రద్దైంది. దీంతో ఈ టెస్ట్ ఫలితం తేలుతుందా..? లేక వరుణుడి దెబ్బకు డ్రాగా ముగుస్తుందా..? అన్న అనుమానాలు ఉన్నాయి. నాటింగ్‌హామ్ టెస్ట్‌లో మూడో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ 70 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్ రెండో…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇప్పటి వరకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో.. అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించాయి.. భారత ప్రభుత్వం కూడా వేగంగా వ్యాక్సినేషన్ జరిగేలా చర్యలు తీసుకుంటుంది.. దేశీయంగా తయారు అవుతున్న వ్యాక్సిన్లతో ఆ గోల్ చేరుకోవడం కష్టమని భావించి.. విదేశీ సంస్థల వ్యాక్సిన్లకు సైతం అనుమతి ఇస్తూ వస్తుంది.. ఇక, ఇప్పటికే సింగిల్ డోస్ వ్యాక్సిన్ తయారు చేసిన అమెరికాకు చెందిన జాన్సస్ అండ్ జాన్సన్… అమెరికాతో పాటు మరికొన్ని…
టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.. రెజ్లింగ్ 65 కిలోల విభాగంలో క్వార్టర్స్‌లో విజయం సాధించారు.. క్వార్టర్ ఫైనల్లో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మోర్తజాను 2-1 తేడాతో ఓడించాడు.. కేవలం 4:46 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించాడు భజరంగ్ పునియా.. ఇక సెమీ ఫైనల్లో అజర్ బైజాన్‌కు చెందిన అలియెవ్ హజీతో తలపడనున్నాడు భజరంగ్ పునియా.. సెమీస్ విజయం సాధిస్తే ఏదో ఒక మెడల్ ఖాయంగా భారత్‌కు అందించనున్నాడు భజరంగ్.. లేదంటే…
టోక్యో ఒలింపిక్స్ లో ఇవాళ బ్రిటన్ మరియు భారత మహిళల హాకీ జట్ల మధ్య కీలక పోరు జరిగింది. అయితే… ఈ ఉత్కంఠ పోరులో భారత మహిళల హాకీ జట్టు బ్రిటన్‌పై ఓటమి పాలైంది. దీంతో చేతులారా కాంస్య పతకాన్ని భారత మహిళల హాకీ జట్టు మిస్ చేసుకుంది. అటు భారత మహిళల హాకీ జట్టు ఘటన విజయం సాధించిన బ్రిటన్ జట్టు కాంస్య పతకాన్ని ఎగురేసుకుని పోయింది. బ్రిటన్‌తో జరిగిన పోరులో 3-4 తేడాతో పరాజయం…
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట అర్ధాంతరంగా ముగిసింది. వరుణుడు పదేపదే అడ్డుతగలడంతో ఆటకు అంతరాయం కలిగింది. చివరికి వాతావరణం అనుకూలించకపోవడంతో అంపైర్లు రెండో రోజు ఆటను నిలిపివేశారు. ఆట ఆగిపోయే సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 58 పరుగులు వెనకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 21తో రెండోరోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 97 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ…
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో రజత పతకం దక్కింది.. కుస్తీ వీరుడు రవికుమార్ సిల్వర్ మెడల్ గెలిచాడు.. పురుషుల 57 కిలోల విభాగంలో ఫైనల్లో రష్యా రెజ్లర్ చేతిలో ఓటమి పాలయ్యాడు రవికుమార్.. దీంతో.. ఆయన పసిడి పతకంపై పెట్టుకున్న ఆశలు ఆవిరికాగా… రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. రష్యా రెజ్లర్‌తో పోరాడి 4-7తో ఓడిపోయాడు రవికుమార్ దహియా.. ఫైనల్ ఓడినా ఆయనకు రజతం దక్కగా.. ఒలింపిక్స్ చరిత్రలోనే సిల్వర్ గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు…
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం వరకు 30 వేల వరకు నమోదవుతుండగా, గత రెండు రోజుల నుంచి మళ్లీ పెరగడం ప్రారంభించాయి. దేశంలో కొత్తగా 42,982 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,12,114కి చేరింది. ఇందులో 3,09,74,748 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,11,076 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24…
ఎలాగైనా స్వర్ణం గెలవాలని టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌తో ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతిలో ఒటమిపాలైన సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు కాంస్యపతకం పోరులో భారత జట్టు జర్మనీతో తలపడింది. నాలుగు క్వార్టర్ లుగా సాగిన గేమ్ హోరాహోరీగా సాగింది. రెండు క్వార్టర్లు ముగిసే సరికి 3-3 గోల్స్‌తో సమంగా ఉన్నాయి. అయితే, మూడో క్వార్టర్ లో ఇండియా లీడ్ సాధించి రెండు గోల్స్ చేసి 5-3 ఆధిక్యాన్ని సాధించింది.…